BigTV English

Gig Workers Act: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గిగ్ వర్కర్ల భద్రత కోసం కొత్త చట్టం

Gig Workers Act: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గిగ్ వర్కర్ల భద్రత కోసం కొత్త చట్టం

Gig Workers Act: గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్​ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది. అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు నిన్న సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ ముసాయిదాకు సీఎం పలు మార్పులు చేర్పులను సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం డేలా కొత్త చట్టం ఉండాలని సీఎం అభిప్రాయం. దానికి తగ్గట్టు బిల్లు ముసాయిదాను తయారు చేసి ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని సేకరించి గిగ్ వర్కర్ల ఉద్యోగానికి భద్రత కల్పించేలా చట్టాన్ని తయారు చేయాలని ఆదేశించారు.


ప్రస్తుతం తెలంగాణలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని ప్రభుత్వ అంచనా. అందుకే వారికి భద్రత కోసం అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉందని రేవంత్ రెడ్డి ఆలోచన. ఆ తర్వాత పకడ్బందీగా ఈనెల 25న బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని చెప్పారు సీఎం. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొదటి సారిగా వారికి ప్రమాద బీమాను అమలు చేశారు. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా అందేలా 2023 డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.


Also Read: తెలంగాణలో అమలులోకి కొత్త చట్టం.. ఇక రైతుల సమస్యలకు పులిస్టాప్ పడినట్టే..

ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి నేడు జపాన్ బయలుదేరనున్నారు. రేపటి నుండి ఈనెల 22 వరకు జపాన్ లో పర్యటించనున్నారు. 8 రోజులపాటు కొనసాగనున్న జపాన్‌ పర్యటనలో CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో CM పర్యటన కొనసాగనుంది. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం పాల్గోనున్నారు. టోక్యోలో పలు పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం…జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడం… అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×