BigTV English

SS Thaman: ఇదిగో ఫ్యాన్సూ… ఓజీ రెడీ అయిపోయింది… సూపర్ అప్డేట్ ఇచ్చిన థమన్

SS Thaman: ఇదిగో ఫ్యాన్సూ… ఓజీ రెడీ అయిపోయింది… సూపర్ అప్డేట్ ఇచ్చిన థమన్

SS Thaman: టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తొమ్మిదేళ్ల వయసులో సినీ ప్రపంచంలో అడుగుపెట్టి.. తక్కువ టైం లోనే రిథమ్ డ్రమ్స్ ప్లేయర్ గా మారిపోయారు. వరుసగా సినిమాలు చేస్తూ, ప్రతి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొడుతూ, తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన జాట్, మాడ్ స్క్వేర్ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఆయన సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఆయన సినిమా కోసం పనిచేయడం కుదరట్లేదు. ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన OG, హరిహర వీరమల్లు ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. అయితే ఈ సినిమా పై ఎక్కడ లేని హైపు ఉంది. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైం లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్త చెప్పాడు.


OG సినిమా..

ప్రముఖ యాంకర్ సుమతో, తమన్ జరిపిన చిట్ చాట్ లో OG సినిమా విశేషాలను పంచుకున్నారు. OG సినిమా మ్యూజిక్ కంప్లీట్ అయిందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా వచ్చిందని, రిలీజ్ అయిన తర్వాత, పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఈలలు వేయించే విధంగా ఉంటాయని తమన్ తెలిపాడు. సుమతో చిట్ చాట్ షోలో ప్రోమో మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.అసలు ప్రోమో లో ఏముందో చూద్దాం ..


సుమతో సరదాగా ..

సుమ చిట్ చాట్ షోలో సుమ మ్యారేజ్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి అని అడగ్గా.. తమన్ నవ్వుతూ పెళ్లయిన పది సంవత్సరాలు చాలా బాగుంటుంది. తర్వాత బిఫోర్ మ్యారేజ్ బాగుంది అనిపిస్తుంది అని సమాధానం చెప్తాడు. మీకు క్రికెట్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడగ్గా.. నాకు ఎప్పుడూ ధోని అంటేనే ఇష్టం అని సమాధానం ఇస్తాడు. సుజిత్ OG ల గురించి ఏమైనా చెప్పండి అని అడగ్గా.. సుజిత్ సూపర్ డైరెక్టర్, సినిమా దాదాపు కంప్లీట్ అయిపోయింది. తెలుగు ఇండస్ట్రీలోనే ఓజి సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని తమన్ తెలిపాడు. తర్వాత గుంటూరు కారం సినిమా కోసం నేను చాలా నెలలు కష్టపడ్డాను. మూడు సంవత్సరాలు మహేష్ బాబు సినిమా ఉండదు. తర్వాత మహేష్, రాజమౌళితో సినిమాకి వెళ్ళిపోతారు. ఇక ఫ్యాన్స్ కి ఈ పాటలే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు గుర్తుండిపోయేలా ఇవ్వాలని కష్టపడ్డాను. పుష్ప సినిమాలో పాటలు తమన్ చెయ్యలేదు అని టాక్ వచ్చింది దాని గురించి అని అడగ్గా.. నేను మూడు భాగాలు కంప్లీట్ చేసిన తర్వాత అది బాగా రాలేదని చెప్పి ప్రోమో ని కట్ చేశారు. లాస్ట్ లో శింబుతో ఏమైనా పాట పాడిస్తున్నారా అని సుమ అడగగా అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా తమన్ అందించిన ఈ గుడ్ న్యూస్ నిజంగా పవన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త.

Ram Charan : పెద్ది టీజర్ లో చరణ్ క్యారెక్టర్ పై రచ్చ డైరెక్టర్ కామెంట్స్… ఇలా అన్నాడేంటి..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×