OYO Rename: ప్రముఖ హోటల్ చైన్ కంపెనీ ఓయో అధినేత రితేష్ అగర్వాల్ బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్ కు కొత్త పేరును సూచించాలని ఆహ్వానించాడు. త్వరలో ఓయో ఐపీఓకి(IPO) వెళ్తున్నది. అంతేకాదు, మరిన్ని ప్రీమియం విభాగాలలోకి తమ సేవలను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పేరుతో బలంగా ముందుకు వెళ్లాల్సిన రితేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సో, ఇక మీరు ‘అది’ వాడితే చాలు.. అదేనండి మైండ్. మీ మైండ్ వాడి అదిరిపోయే పేరు సూచించండి!
విజేతకు రూ. 3 లక్షల నగదు బహుమతి
ఒరావెల్ స్టేస్ కోసం పేర్లను సూచించే ఎంట్రీలు ఇప్పటికే ప్రారంభమయ్యాడు. త్వరలో ముగుస్తాయని రితేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చక్కటి పేరును సూచించిన వారికి రూ. 3 లక్షలు నగదు బహుమతి అందిస్తామని ఆయన ప్రకటించారు. గ్లోబల్ ట్రావెల్ టెక్ స్టార్టప్ తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో పేరు మార్పు అంశాన్ని తీసుకురావడం వెనుక వేరే ఉద్దేశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొత్త పేరు ఎలా ఉండాలో చెప్పిన రితేష్!
ప్రజలు తన మాతృ సంస్థకు సూచించే పేరు.. బోల్డ్ గా, ఒక పదంతో, ప్రపంచ వ్యాప్త ఆకర్షణతో, ఏ ఒక్క సంస్కృతి, భాషకు పరిమితం కానిదిగా ఉండాలన్నారు. అంతేకాదు, టెక్-ఫార్వర్డ్ గా, ఆకట్టుకునేలా, గుర్తుండిపోయేలా, ఆతిథ్యానికి మించి అభివృద్ధి చెందేంత విశాలంగా ఉండాలన్నాడు. ఆ పేరు గో డాడీ డొమైన్ అందుబాటులో ఉండాలన్నాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న పేర్లలో అత్యంత చక్కటి పేరును సెలెక్ట్ చేసి, విజేతను ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఓయో పేరు మారుతుందా?
పేరు మార్పు ప్రకటన చూసి ఓయో పేరు మారుతుందని చాలా మంది భావిస్తున్నారని రితేష్ చెప్పారు. కానీ, అది నిజం కాదన్నారు. “మేము మా మాతృసంస్థ పేరును మార్చుతున్నాం. హోటల్ చైన్ ఓయో పేరు కాదు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణ ఆవిష్కరణలు, ఆధునిక జీవన శైలిని పెంచేందుకే మాతృ సంస్థ పేరును మార్చాలి నుకుంటున్నాం. ఇండియా నుంచి పుట్టిన కొత్త గ్లోబల్ బ్రాండ్.. ప్రపంచం కోసం నిర్మించబడింది. కొత్త పేరుతో మరింతగా విశ్వవ్యాప్తం అవుతుందని భావిస్తున్నాం” అని రితేష్ వెల్లడించాడు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో ప్రారంభం
అటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q4లో IPOను ప్రారంభించాలని OYO యోచిస్తోంది. కొత్త పేరును త్వరో ప్రారంభించబోతున్న ప్రీమియం హోటల్స్ యాప్ కు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కంపెనీ పేరు చాలా యూనిక్ గా ఉండాలని అగర్వాల్ భావిస్తున్నారు. అందుకే, ఈ పోటీని నిర్వహించి పేరును సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో త్వరలో తేలనుంది. ఈ కొత్త పేరు ఓయో అధినేతకు బాగా కలిసి రావాలని కోరుకుందాం.
Read Also: నో పోలీస్ వెరిఫికేషన్, 3 రోజుల్లో ఇంటికే పాస్ పోర్ట్, ఎలా అంటే?