Allu Arjun Case : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా పోలీసులు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను క్యాన్సిల్ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ ను వేయబోతున్నారనే వార్త బయటకు వచ్చింది.
రీసెంట్ గా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి, ఏకంగా ఒక రాత్రి జైల్లో పెట్టిన ఘటన సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు అయిన గంటల వ్యవధిలోనే ఆయన మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారనుకోండి. అది వేరే విషయం. అయితే ఒకరి చావుకు కారణమై కూడా, ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే అల్లు అర్జున్ (Allu Arjun) ఇలా గంటల వ్యవధిలో బయటకు రావడం కొంతమందికి మింగుడు పడట్లేదు. కానీ అల్లు అభిమానులు మాత్రం ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోని అలా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఇప్పటికీ మండి పడుతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసులో ఏం జరిగింది? అన్నది ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఓవైపు పోలీసులు హీరోని థియేటర్ దగ్గరికి రావద్దు అని ముందే చెప్పాము అని చెప్తుంటే, మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేము ముందుగానే హీరో వస్తున్నాడని పోలీసులకు తెలియజేశాము అంటూ ఓ లేఖను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆ లేఖ రిలీజ్ అయ్యాక పోలీసులదే తప్పు అన్నట్టుగా విమర్శలు ఎదురయ్యాయి. అయితే కోర్టులో మాత్రం ప్రభుత్వ తరపు లాయర్ పోలీసులు వద్దన్నా కూడా హీరో అక్కడికి రావడం వల్లే ఘటన జరిగింది, బెయిల్ ఇవ్వద్దు అంటూ వాదించడం తెలిసిందే. కానీ ఈ కేసులో తాజాగా ఓ లేఖ బయటకు రావడం, అంతలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నారనే వార్త రావడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా హీరో, హీరోయిన్లు థియేటర్ దగ్గరకు వస్తే, అక్కడ క్రౌడ్ ను కంట్రోల్ చేయడం కష్టం అంటూ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కు పోలీసులు ఓ లేఖ ద్వారా ముందుగానే హెచ్చరించినట్టుగా సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతుంది. ఆ లెటర్ వైరల్ అయిన గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను క్యాన్సల్ చేయాలంటూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే పకడ్బందీగా ప్లాన్ చేసి, బన్నీ (Allu Arjun)ని వదిలి పెట్టకూడదని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.
ఇక హైకోర్టు బన్నీకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మిగిలిన వ్యవహారం అంతా కింది కోర్టులోనే చూసుకోండి అని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో ఉంది. మరి నిజంగానే పోలీసులు బన్నీ మధ్యంతర బెయిల్ ను క్యాన్సిల్ చేయమంటూ సుప్రీం కోర్టుకు వెళ్తారా? ఆ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.