Guava Juice: జామ కాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ కాయను జ్యూస్ లాగా చేసుకుని కూడా త్రాగవచ్చు. జామ రసం ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిని త్రాగడం వల్ల అనేక శారీరక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. జామ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జామ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: జామకాయలు చలికాలంలో మార్కెట్‌లో విరివిగా లభిస్తుంటాయి. జామపండు పుష్కలంగా పోషకాలు కలిగిన పండు. జామ రసాన్ని తాగడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. జామ రసం రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
మలబద్ధకంతో బాధపడేవారు జామ రసం తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జామ రసం కూడా చాలా మేలు చేస్తుంది. జామ రసం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
జామ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: జామలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు తరుచుగా జామ కాయ లేదా జామ జ్యూస్ త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పొట్టను శుభ్రపరుస్తుంది: ఈ రసం పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా అసిడిటీ, గ్యాస్ వంటి ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తరుచుగా జామ కాయతో తయారు చేసిన జ్యూస్ త్రాగడం వల్ల అసిడిసీ లాంటి సమస్యలు తక్షణమే తగ్గుతాయి.
రక్తపోటును నియంత్రిస్తుంది: జామపండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు జామ కాయతో తయారు చేసిన జ్యూస్ త్రాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ త్రాగడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: జామ విటమిన్ సి యొక్క మంచి మూలం. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. జామ కాయతో తయారు చేసిన జ్యూస్ తరుచుగా త్రాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
చర్మానికి మేలు చేస్తుంది: చర్మాన్ని మెరుగుపరుస్తుంది: జామలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం జామ రసం త్రాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ముడతలను తగ్గిస్తుంది: ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముడతలను కూడా తగ్గిస్తుంది.
మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: జామ రసం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ టీ త్రాగితే.. వ్యాధులన్నీ పరార్ !
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది: ఇందులో ఉండే పీచు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది మిమ్మల్ని తక్కువగా తినేలా చేస్తుంది.
కళ్లకు మేలు చేస్తుంది: జామపండులో కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఎ ఉంటుంది.