Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ గేమ్ ఛేంజర్ ‘.. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాలో కనిపించాడు. అది భారీ డిజాస్టర్ అవ్వడంతో చరణ్ ఇమేజ్ పై ఎఫెక్ట్ పడిందని టాక్. అయితే ఆ మూవీ నుంచి బయట పడటానికి రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు స్టోరీ ఏదొక రకంగా లీక్ అవుతుంది. దాంతో ఇప్పుడు సినిమాలో హైలెట్ అంశాన్ని పెట్టి అందరిలో ఆసక్తిని కలిగించాలని చిత్ర డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు ఓ వార్త షికారు కొడుతుంది. ఆలస్యం లేకుండా ఆ వార్త ఏంటో తెలుసుకుందాం..
గేమ్ ఛేంజర్ మూవీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ యాక్షన్స్, పొలిటికల్ డ్రామా మూవీ ‘ గేమ్ ఛేంజర్ ‘.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లీక్ అయ్యింది. షూటింగ్ లొకేషన్లో రామ్ చరణ్ లుక్ కూడా బయటకు వచ్చేసింది. రామ్ చరణ్ లీకైనా సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చూసాము.. అయితే ఈ మూవీ రామ్ చరణ్ లైఫ్ లో హిస్టరీ క్రియేట్ చేసే మూవీ అని ఈ మూవీని థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ లో హైడ్రా పై చర్చ..
రామ్ చరణ్ సినిమాలు అంటే ఏదొక మెసేజ్ ఇస్తాయి అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఈ గేమ్ చేంజర్ మూవీలో కూడా శంకర్ ట్రేండింగ్ టాపిక్ ను వాడుతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా పేరు సంచలనంగా మారింది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకవైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ పాయింట్ లో శంకర్ గేమ్ ఛేంజర్ లో వాడబోతున్నాడని టాక్.. మరి సినిమాలో కూడా అలానే చూపిస్తాడా? లేక కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.. చూద్దాం ఎం మ్యాజిక్ చేసి జనాలను థియేటర్లకు రప్పిస్తాడో.. ఈ మూవీ హిట్ అయితే చరణ్ క్రేజ్ మరో మెట్టు పెరుగుతుంది. చూద్దాం ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..