Hyper Aadi hero entry: జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారా? అందుకే ఇటీవల వారితో భేటీ అయ్యారా? అనే టాక్ నడుస్తోంది. మొత్తం మీద ఆది బుల్లితెర నటుడిగా పరిచయమై, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా హైపర్ ఆది హీరో కానున్నాడనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. అయితే అదేమీ లేదని ఆది అభిమాన వర్గం అంటున్న, సినిమా హీరోగా ఎంట్రీ ఖాయమన్న వార్తలు గుప్పు మంటున్నాయి. ఇంతకు ఆది ఎవరితో భేటీ అయ్యారు? ఎందుకు ఈ చర్చ అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ, జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న విషయం తెల్సిందే. అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడం విశేషం. ఎవరూ ఊహించని రీతిలో హైపర్ ఆది తనకంటూ క్రేజ్ సంపాదించుకోగా, పలు సినిమాలలో కూడా పెద్ద నటులతో నటించే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీకి దగ్గరైన ఆదిపై పలు రాజకీయ విమర్శలు సైతం వినిపించాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న ఆది జనసేన కండువా కప్పుకొని రాజకీయ ప్రచారాలు సాగించారు. ఆ తర్వాత పవన్ పోటీ చేసిన పిఠాపురం లో విస్తృత ప్రచారం నిర్వహించి, నాటి అధికారపక్ష పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు. దీనితో పలుమార్లు ఆదిని వైసీపీ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. అయితే మెగా కాంపౌండ్ లో గల హైపర్ ఆదికి సినిమా ఛాన్సులకు కొదువలేదని చెప్పవచ్చు.
Also Read: Roja Selvamani : రోజాను కొట్టిన బుడ్డది.. కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..!!
ఒంగోలుకు హైపర్ ఆది..
స్వంత జిల్లా కేంద్రం ఒంగోలుకు ఇటీవల హైపర్ ఆది వచ్చారు. ఈ సంధర్భంగా పలువురు ప్రముఖులతో భేటీ కావడం గమనార్హం. ఆది బర్త్ డే రోజు జిల్లాలో సేవా కార్యక్రమాలు సాగించడం ఆది ఫ్యాన్స్ కు పరిపాటి. ఇటీవల బర్త్ డే జరుపుకున్న ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒంగోలులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆయన ఫ్యాన్స్.
హీరోయిన్ కుటుంబంతో ఆది భేటీ..
హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆది భేటీ అయ్యారు. శ్రీలీల స్వగ్రామం కూడా ఒంగోలు కావడంతో మర్యాద పూర్వకంగా ఆది భేటీ అయ్యారా? లేక సినిమా ప్లానింగ్ లో భాగమా అంటూ ఒంగోలులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాకుండా కాపు సంఘం నాయకులు మండవ మురళీకృష్ణ తో కూడా ఆది భేటీ అయ్యారు.
హీరోగా ఆది ఎంట్రీ?
ఇప్పటికే ఎన్నో సినిమాలలో కామెడీ ఆర్టిస్ట్ గా, అలాగే కీలక పాత్రల్లో కనిపించిన హైపర్ ఆది హీరోగా ఎంట్రీ ఖాయమని పలుమార్లు పుకార్లు షికార్లు చేశాయి. జబర్దస్ట్ ప్లాట్ ఫామ్ నుండి సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కానీ హైపర్ ఆది కూడా హీరో మెటీరీయల్ అని, ఆ రీతిలో సినిమా ఆఫర్లు వస్తున్నాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే ఒంగోలు పర్యటనలో మర్యాదపూర్వకంగా శ్రీలీల తాతతో ఆది భేటీ అయినప్పటికీ, హీరోగా ఆది పరిచయమయ్యే టాక్ మధ్య వారితో భేటీ కీలకంగా మారిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏదిఏమైనా హైపర్ ఆది హీరోగా పరిచయమైతే హీరోయిన్ ఎవరన్నది కూడా ఈ చర్చ బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ అంటున్నారు.