BigTV English

Sarkaar Season 4: ఆట మారింది.. ఆటగాడు మారాడు.. సర్కార్ సీజన్ 4లో సుడిగాలి సుదీర్!

Sarkaar Season 4: ఆట మారింది.. ఆటగాడు మారాడు.. సర్కార్  సీజన్ 4లో సుడిగాలి సుదీర్!

Sudigali Sudheer as a Anchor in Sarkar Season 4: జబర్దస్త్ నుంచి వచ్చిన హీరోల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడు షోస్ లతో కూడా అలరిస్తున్నాడు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ ఉగాది ఈవెంట్ కు సుధీర్ నే యాంకర్ గా చేశాడు. ఇందులో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ కు డ్యాన్స్ చేసి స్టేజిని దద్దరిల్లేలా చేశాడు. ఇక తాజాగా సుధీర్.. మరో షోకు యాంకర్ గా మారాడు. ఆహాలో ప్రదీప్ చేసిన షోస్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న షో సర్కార్. ఇప్పటికి మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేశాడు.


స్టార్ సెలబ్రీటీలను పిలిచి వారితో గేమ్స్ ఆడించి.. బెట్టింగ్ కట్టించి డబ్బులను తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇందులో ఫన్నీ గేమ్స్ కూడా ఉంటాయి. ప్రదీప్ చలాకీత్నం, మాటకారితనంతో ఈ షో మూడు సీజన్స్ ఎంతో అద్భుతంగా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా సర్కార్ నాలుగవ సీజన్ మొదలు అయ్యింది. అయితే ఈసారి ఆట మారింది.. ఆటగాడు మారాడు. అవును .. సర్కార్ సీజన్ 4 లో ప్రదీప్ ప్లేస్ లో సుధీర్ వచ్చి చేరాడు. ఈ విషయాన్నీ ఆహా అధికారికంగా తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.

Also Read: Ramayanam: బ్రేకింగ్: ‘రామాయణం’ మూవీకి నిర్మాతగా రాఖీభాయ్ యష్.. నమిత్ మల్హోత్రాతో కలిసి..


ఇక ఇందులో సుధీర్ ఆట గురించి చెప్పుకొచ్చాడు. మనం క్యాష్ ను పైకి విసురుతాం.. ఎందుకంటే అది కిందపడుతుందని మనకు తెలుసు కాబట్టి.. అది కిందపడదు అని తెలిస్తే .. కనీసం కాయిన్ కూడా విసరం. అది డబ్బుకు ఉన్న పవర్. అలాంటి డబ్బు కోసం డేర్ చేసినోడిదే రోజు.. రిస్క్ చేసినోడే రాజు.. అంటూ డైలాగ్ చెప్పి ఇకనుంచి సర్కార్ సీజన్ 4 .. ఆట మారింది.. ఆటగాడు మారాడు అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సీజన్ మొదలుకానుంది. చాలా గ్యాప్ తరువాత సుధీర్ ఈ షోలో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ షోతో సుధీర్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×