RGV: ప్రస్తుతం సిన్సియర్ గా సినిమాలు తీయడం మానేశాడు. కానీ ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే ఒక బ్రాండ్. రాంగోపాల్ వర్మ ఆలోచనలే చాలా కొత్తగా అనిపించేది. తను దర్శకుడుగా పరిచయమైన శివ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శివ సినిమాకి ముందు శివ సినిమా తర్వాత అనే ప్రస్తావన నడుస్తూనే ఉంటుంది. ఒక మూస ధోరణితో సాగిపోతున్న తెలుగు సినిమాను తన సరికొత్త టెక్నిక్ తో పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వర్మ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ అందుకొని తన బ్రాండ్ ఏంటో చూపించుకున్నాడు.
క్రైమ్ అండ్ గ్యాంగ్స్టర్ సినిమాలు
రాంగోపాల్ వర్మ కెరియర్లో క్రైమ్ అండ్ గ్యాంగ్ స్టార్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో గ్యాంగ్ స్టార్ ఫిలిమ్స్ రాంగోపాల్ వర్మ చేశాడు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుని కూడా ఈ సినిమా ఇన్స్పైర్ చేసింది. కొంతకాలం తర్వాత రాంగోపాల్ వర్మ వరుసగా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ కొన్నేళ్లపాటు ముంబైలోనే ఉండిపోయారు. అప్పుడు ముంబై గ్యాంగ్ స్టార్ తో కూడా రామ్ గోపాల్ వర్మ కు సంబంధం ఉంది అని వార్తలు వినిపిస్తూ వచ్చేవి. ప్రతి క్రైమ్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ సినిమాలు చేసేవాడు రాంగోపాల్ వర్మ.
దావుద్ తో మాట్లాడాను
ముంబైలోని డాన్ అంటే ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం పేరు వినిపించేది. పెద్ద పెద్ద డాన్స్ అందరూ కూడా అప్పట్లో రాంగోపాల్ వర్మ కు పరిచయం అని కథనాలు వినిపించేవి. వస్తావంగా రామ్ గోపాల్ వర్మ దావూద్ ఇబ్రహీం ను కూడా కలిశారు అని అనుకుండేవారు. దానిపై తాజాగా రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. దావూద్ ఇబ్రహీంతో తాను ఫోన్ మాట్లాడాను అని తెలిపారు. అయితే అవతల ఫోన్ మాట్లాడింది దావూద్ అనే క్లారిటీ తనకు లేదు అని తెలిపాడు. కానీ తనకు ఫోన్ చేసి ఇచ్చిన వ్యక్తి మాత్రం దావూద్ కి బాగా క్లోజ్ అని తెలుసు అంటూ తెలిపాడు. ఆ వ్యక్తి ఫోన్ నుంచి వర్మకు ఫోన్ చేసి భాయ్ సాబ్ మాట్లాడుతారు అంటూ ఫోన్ ఇచ్చాడట. తాను మాట్లాడను కానీ అది దావుదా కాదా అనే క్లారిటీ తనకు లేదని తెలిపాడు వర్మ.
Also Read : Ram Chran Peddi: భారీ సెట్టింగ్ తో రామ్ చరణ్ పెద్ది, గురువును మించిపోతాడా.?