BigTV English

OTT Movie : ఈ కెమెరాతో ఫోటోలు తీస్తే దెయ్యాలు కన్పిస్తాయట… ఇదెక్కడి వింత గాడ్జెట్ రా సామీ

OTT Movie : ఈ కెమెరాతో ఫోటోలు తీస్తే దెయ్యాలు కన్పిస్తాయట… ఇదెక్కడి వింత గాడ్జెట్ రా సామీ

OTT Movie : ఊహించని ట్విస్టులతో వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ ఉండే సినిమాలను చూడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ దెయ్యాలను పట్టుకునే సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం ఓ కెమెరా దెయ్యాలను పట్టిస్తుంది. ఆ దెయ్యాలు మామూలు మనుషుల కంటికి కనిపించవు. కానీ ఆ కెమెరాతో ఫోటోలు తీస్తే మాత్రం గుండె అదిరిపోయే సీన్స్ కన్పిస్తాయి. మరి ఇలాంటి స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఆ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


స్టోరీలోకి వెళితే
బర్డ్ ఫిచర్ అనే అమ్మాయి హైస్కూల్ లో చదువుతూ ఉంటుంది. ఆమెకు టైలర్ అనే స్నేహితుడు పాత పోలరాయిడ్ కెమెరాను బహుమతిగా ఇస్తాడు. ఈ కెమెరాకు ‘RJS’ అనే అక్షరాలు చెక్కి ఉంటాయి. బర్డ్ ఈ కెమెరాతో టైలర్ ఫోటో తీస్తుంది. కానీ ఆ ఫోటోలో వింత ఆకారం కనిపిస్తుంది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా వచ్చిందేమోలే అనుకుంటుంది. తర్వాత బర్డ్ తన స్నేహితులతో కలిసి ఒక కాస్ట్యూమ్ పార్టీకి వెళ్తుంది. అక్కడ ఆమె ఈ కెమెరాతో గ్రూప్ ఫోటో తీస్తుంది. అదే సమయంలో టైలర్ ఒక దెయ్యం లాంటి శక్తి చేతిలో దారుణంగా చనిపోతాడు. బర్డ్ ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇక టైలర్ ఫోటోలో ఉన్న వింత ఆకారం అదృశ్యమై, అది ఆమె స్నేహితురాలు ఆవరీ ఫోటోలోకి మారుతుంది. ఆ తర్వాత ఆవరీ కూడా చనిపోతుంది. ఈ కెమెరా లో ఒక దుష్ట శక్తి ఉందని, దీనితో ఫోటో తీసిన వారందరూ దారుణమైన మరణాలను ఎదుర్కొంటారని బర్డ్ తెలుసుకుంటుంది. ఆమె తన స్నేహితులను హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ శాపాన్ని ఆపడం అంత సులభం కాదు. ఫోటోను నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఫోటోలో ఉన్న వ్యక్తులకు మరింత హాని జరుగుతుంది. ఉదాహరణకు ఫోటోను కాల్చడానికి ప్రయత్నిస్తే, ఫోటోలోని వ్యక్తి శరీరంపై కూడా మంటలు వస్తాయి.

ఈ క్రమంలోనే బర్డ్, ఆమె స్నేహితులు కెమెరా చరిత్రను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఈ కెమెరా ఒక దెయ్యం లాంటి శక్తితో ముడిపడి ఉందని, దాని శాపం నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఇంకా ఒక్క రాత్రి బ్రతికితే సరిపోతుందని తెలుస్తుంది. మరి ఆ ఒక్క రాత్రి వీళ్లందరికీ ఎలా గడిచింది? ఆ దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు? చివరికి బ్రతికింది ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ సినిమాను ఓటీటీలో చూడాల్సిందే.


Read Also : ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, ఊహించని పని… మైండ్ డిస్టర్బింగ్ మిస్టరీ థ్రిల్లర్

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ సూపర్ సూపర్‌ నాచురల్ హారర్ మూవీ పేరు ‘పోలరాయిడ్’ (Polaroid). 2019లో వచ్చిన ఈ సినిమాకు లార్స్ క్లెవ్‌బెర్గ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2015లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా “ది రింగ్”, “ఫైనల్ డెస్టినేషన్” లాంటి హారర్ సినిమాల స్టైల్‌లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక శాపగ్రస్త వస్తువు కథను నడిపిస్తుంది. ఈ సినిమా Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

Tags

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×