Dogs King: మనుషులకు రాజులు ఉన్నట్లే.. జంతువులకు రాజులు ఉంటారా? మనం సాధారణంగా అడవికి రాజు సింహం అంటుంటాం. అంటే, అడవిలోని అన్ని జంతువులు సింహం మాట వినాలి. అది చెప్పినట్లే నడుచుకోవాలన్నమాట. ఇవన్నీ కథల్లో చదువుతుంటాం. కానీ, నిజంగా అడవికి రాజుగా సింహం వ్యవహరిస్తుందా? అనేది తెలియదు. మనం చూడలేం కూడా. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే మాత్రం, కుక్కలకు రాజు ఉంటాడనే విషయం అర్థం అవుతోంది. కుక్కలేంటి? రాజు ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, అర్జంట్ గా మీరు ఈ స్టోరీ చదివేయాల్సిందే..
కుక్కలకు రాజు ఉంటాడా?
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ఇందులో కుక్కలు అన్నీఒకచోట చేరాయి. ఏం జరిగిందో తెలియదు గానీ, ఓ కుక్కకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మిగతా కుక్కల మీద కయ్యానికి కాలు దువ్వింది. గట్టి గట్టిగా అరుస్తూ ఇతర కుక్కలను కరవడం మొదలు పెట్టింది. గొడవ పెద్దిది అయ్యింది. పంచాయితీ తీవ్రస్థాయికి చేరింది. అరుపులు, కరుపులు ఎక్కువయ్యాయి. ఇంతలో విషయం లీడర్ కు తెలిసింది. వెంటనే అక్కడికి వచ్చింది.
ఒంగి ఒంగి రెస్పెక్ట్ ఇస్తున్న ఇతర కుక్కలు
ఒక తెల్లటి బొచ్చుకుక్క అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. అల్లంత దూరం నుంచి కనిపించగానే అక్కడ ఉన్న డాగ్స్ లో ఎక్కడ లేని గౌరవం పెరిగింది. దాన్ని చూసి వంగి వంగి దండం పెడుతున్నాయి. పక్కకు పక్కకు తప్పుకుంటున్నాయి. పడుకుని ఉన్న కుక్కలు ఒక్కసారిగా లేచి నిలబడి తమ గౌరవాన్ని చాటుకున్నాయి. వస్తూ వస్తూనే, గొడవకు కారణం అయిన కుక్కకు పడేసి, పైన నిల్చుంది. ఒక్కసారిగా రాజు రావడంతో భయంతో వణికిపోయింది. అంతేకాదు, గొడవకు ఫుల్ స్టాఫ్ పెట్టింది. ఆ సీన్ చూసి, మిగతా కుక్కలు కూడా అక్కడి నుంచి సైలెంట్ గా అక్కడి నుంచి తప్పించుకుటాయి. క్షణాల్లో గొడవ ఆగిపోయింది.
Read Also: ఈ ఒక్కడికే 1700 గదుల భవనం.. ఖరీదైన 600 రోల్స్ రాయిస్ కార్లు.. అంత సంపాదన ఎలా?
కుక్కల రాజు అంటూ నెటిజన్ల ప్రశంసలు
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు సదరు బొచ్చు కుక్క మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. లీడర్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అంటున్నారు. ఇంతకీ ఆ కుక్కకు ఇతర కుక్కలు అంత రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. నల్ల కుక్క దాన్ని చూసి భయంతో వణికిపోయింది. ఎందుకో దానికి అంత భయం? అని మరికొంత మంది ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి జంతువులలో రాజులు ఉంటారని వినడమే తప్ప, చూడ్డం ఇదే తొలిసారి అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. మీరూ ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి. ఎలా అనిపించిందో చెప్పేయండి!
the dog with the most aura i’ve ever seen pic.twitter.com/AjiHK29j0L
— kira 👾 (@kirawontmiss) May 21, 2025
Read Also: వెడ్డింగ్ వెన్యూకు మంటలు.. సంబరాలు చేసుకుంటున్న జనం.. ఎందుకలా?