BigTV English

Pushpa 2 Allu Arjun: ఇదెక్కడి స్కామ్ అండి.? టికెట్స్ అన్నీ అల్లు అర్జున్ తీసుకున్నాడట

Pushpa 2 Allu Arjun: ఇదెక్కడి స్కామ్ అండి.? టికెట్స్ అన్నీ అల్లు అర్జున్ తీసుకున్నాడట

Pushpa 2 Allu Arjun: కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. అల్లు అర్జున్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా విపరీతమైన అంచనాలను పెంచుతుంది. ఇకపోతే అందరికీ నిరాశ కలిగించే విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు. ముంబై వంటి సిటీలో ఈ సినిమా టికెట్ దాదాపు 3000 వరకు ఉంది. బెంగళూరులో ఈ సినిమా టికెట్ 2000 పైగా ఉంది. హైదరాబాద్లో దాదాపు 1200 వరకు ఈ సినిమా టికెట్ రేట్లు ఉన్నాయి.


ఇకపోతే ఒక సినిమాను చూసే థియేటర్ బట్టి కూడా ఒక హై వస్తుంది అని చెప్పాలి. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ను వైకుంఠం అని కూడా ఫీలవుతుంటారు. చాలామంది సినిమా లవర్స్ కు అది ఫేవరెట్ ప్లేస్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూడటం అనేది కొంతమందికి డ్రీమ్ అని కూడా చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించే చాలా వీడియోలు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూస్తున్నప్పుడు రికార్డ్ చేసే వీడియోలు ఉంటాయి. ఇకపోతే పుష్ప సినిమాను అక్కడ చూడాలని చాలామంది అల్లు అర్జున్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పుష్ప సినిమాకి సంబంధించిన టికెట్స్ దొరకట్లేదట. థియేటర్ యాజమాన్యాన్ని టికెట్లు అడిగినా కూడా టికెట్స్ అన్నీ అల్లు అర్జున్ తీసుకున్నాడు అంటూ చెబుతున్నారు. ఆ మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీపై మళ్లీ నెగెటివిటీ స్టార్ట్ అయింది. సినిమా టిక్కెట్లు అభిమానులకి ఇవ్వకుండా మీరు తీసుకోవటమేంటి అని సోషల్ మీడియా వేదిక కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే సినిమా టికెట్స్ చిత్ర యూనిట్ తీసుకోవడం అనేది కామన్. అయితే ఆ సినిమాకు పని చేసిన కొంతమంది వ్యక్తులు అలానే ముఖ్యమైన వ్యక్తులు వరకు మాత్రమే సినిమా టికెట్లు తీసుకుంటూ ఉంటారు కానీ అన్ని టికెట్లు అల్లు అర్జున్ తీసుకోవడం ఏంటి అనేది కొంతమంది వాదన. ఇకపోతే అమీర్ పేట్ లో అల్లు అర్జున్ కు కూడా థియేటర్ ఉంది అక్కడ కూడా రేట్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మీ థియేటర్ వదిలేసి మా థియేటర్స్ మీకు పనేంటి ఏంటి బ్రో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇక ఈ సినిమా ఎంత మేరకు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తది అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను బాహుబలి సినిమాతో పోల్చాడు అల్లు అర్జున్. మరి ఆ స్థాయి సక్సెస్ అందుకుంటుందా లేదా వేచి చూడాలి.


Also Read :  Srikanth Odela : ఆ హ్యాండ్ నాది కాదు, చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×