BigTV English

SSMB 29 : గుడ్డా… బ్యాడా..? పాస్ట్ గుర్తొచ్చి తల పట్టుకుంటున్న మహేష్ ఫ్యాన్స్..!

SSMB 29 : గుడ్డా… బ్యాడా..? పాస్ట్ గుర్తొచ్చి తల పట్టుకుంటున్న మహేష్ ఫ్యాన్స్..!

SSMB 29.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు (Mahesh Babu). ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో SSMB -29 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ విషయం అభిమానులను సంతోషపరిచినా.. ఒక బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్లతో నటించిన ప్రతిసారీ కూడా చెప్పుకున్నంత గొప్ప రిజల్ట్ ఐతే రాలేదు. చాలా సందర్భాలలో మహేష్ బాబుకి బాలీవుడ్ హీరోయిన్లతో డిజాస్టర్ లే ఎదురయ్యాయని చెప్పవచ్చు. ఉదాహరణకు..

అమీషా పటేల్..


మహేష్ బాబు, అమీషా పటేల్ జంటగా వచ్చిన చిత్రం ‘నాని’. ఈ సినిమా నిరాశపరిచింది.

అమృత రావు..

బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు, ప్రముఖ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు జంటగా నటించిన చిత్రం ‘అతిథి’. ఈ సినిమా కూడా గొప్పగా ప్రేక్షకులను మెప్పించలేదు.

కృతి సనన్..

మహేష్ బాబు హీరోగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వన్ – నేనొక్కడినే’. ఈ సినిమాలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని కూడా నటించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

సెంటిమెంట్ ని బ్రేక్ చేయనున్న రాజమౌళి.

ఇలా మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్లతో నటించిన ప్రతిసారీ కూడా ట్రాక్ రికార్డు అంతగా బాగాలేదని చెప్పాలి. అయితే ఇది అందరి హీరోయిన్లతో జరిగిందా? అంటే, లేదనే చెప్పాలి. ఎందుకంటే గతంలో.. ప్రీతి జింతా హీరోయిన్ గా 1999 లో వచ్చిన ‘రాజకుమారుడు’, కియారా అద్వానీ హీరోయిన్ గా 2018 లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాలు చేశారు. ఈ సినిమాలకు మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ప్రియాంక చోప్రా ను హీరోయిన్ గా ఎస్ఎస్ఎంబి 29 మూవీలో తీసుకోబోతున్నారు. ముఖ్యంగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందని కొంతమంది మహేష్ బాబు అభిమానులు నమ్ముతున్నారు. అలాగే రాజమౌళి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని కూడా ఫాన్స్ కోరుతున్నారు.

ఎస్ ఎస్ ఎం బీ -29 మూవీ విశేషాలు..

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ లో ఇవ్వడం జరిగింది. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కే.ఎల్. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×