Anil Ravipudi:నటసింహా నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) సినీ కెరియర్లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం ‘ఆదిత్య 369’. టైం ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) నిజ జీవితంలో టైం మెషిన్ ఉంటే ..ఒకవేళ తనకు ఎక్కే ఛాన్స్ వస్తే.. ఖచ్చితంగా 1991 కాలానికి వెళ్లి ఆ హీరోతో సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పారు. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
యంగ్ బాలయ్యతో సినిమా చేయాలని ఉంది – అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీలో ఆదిత్య 369 లాంటి అద్భుతమైన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ముఖ్యంగా 1991లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. నేను అద్దంకిలో శ్రీరామ థియేటర్లో తొలిసారి ఈ సినిమా చూశాను. ఆ తర్వాత కూడా అదే థియేటర్లో ఒక 20 సార్లు చూసి ఉంటాను. ఇక క్యాసెట్లు వచ్చాక కూడా సమ్మర్లో ఎన్ని సార్లు చూసామో లెక్కలేదు. అసలే బాలయ్య అందగాడు. పైగా ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. నాకు గనుక టైం మిషన్ ఎక్కే అవకాశం వస్తే.. ఇదే వయసులో 1991 కాలానికి వెళ్లి యంగ్ బాలయ్యతో ఒక సినిమా చేయాలని ఉంది” అంటూ బాలయ్య పై తన అభిమానాన్ని చాటుకున్నారు అనిల్ రావిపూడి.
మేము ఎప్పటికీ అదృష్టవంతులమే – అనిల్ రావిపూడి
“ఆదిత్య 369 లో మన రాజులు, కవులు, చరిత్ర గురించి చాలా గొప్పగా చూపించారు. భవిష్యత్తు కాలంలో ఈ ప్రపంచం ఎలా మారిపోనుందో కూడా మనకు చూపించారుచరిత్ర ,సైన్స్ కలగలిపిన ఈ చిత్రాన్ని కచ్చితంగా ఈ కాలం పిల్లలు కూడా చూడాలి. తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకొని చూపించాలి. ఈ వీకెండ్ లో పిల్లల్ని థియేటర్ కు తీసుకెళ్లి మరి ఈ సినిమా చూపిస్తారని ఆశిస్తున్నాను. మా జనరేషన్లో ఇలాంటి సినిమాలు వచ్చినందుకు, వాటిని మేము చూసినందుకు గర్వంగా భావించడమే కాకుండా అదృష్టవంతులుగా కూడా మేము ఫీల్ అవుతున్నాము. ఇప్పటి తరానికి కూడా ఆ అదృష్టం లభించాలి” అంటూ అనిల్ రావిపూడి తెలిపారు . ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Insta Reels: రీల్స్ తో ఏకంగా సినిమాలలో ఛాన్స్.. అదృష్టం అంటే ఈ అమ్మాయిలదే..!
నవల ఆధారంగా ఆదిత్య 369..
ఆదిత్య 369 మూవీ విషయానికి వస్తే.. 1991లో విడుదలైన ఈ తెలుగు చిత్రాన్ని హెచ్. జి. వెల్స్ 1895 నవల ది టైం మెషిన్ నుండి స్ఫూర్తి పొంది మరీ తెరకెక్కించారు. సైన్స్, ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్ జోడించి ఈ సినిమా తీశారు. సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasrao)దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిత కృష్ణ, ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మాతలుగా వ్యవహరించారు. 1991 జూలై 18న 141 నిమిషాల వ్యవధితో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించగా.. బాలయ్య సరసన మోహిని నటించారు.ఒక వీరితోపాటు సిల్క్ స్మిత, గొల్లపూడి మారుతీరావు, అంబరీష్ పూరి, చంద్రమోహన్, సుత్తివేలు, శ్రీలక్ష్మి, శుభలేఖ సుధాకర్, తనికెళ్ల భరణి, బాబు మోహన్, బ్రహ్మానందం ఇలా పలువురు నటించడం గమనార్హం.