Brahmamudi serial today Episode: హాస్పిటల్ బయట ఉన్న రాజ్‌ను వచ్చి యామని హగ్ చేసుకుని నువ్వు ఇంత త్వరగా పెళ్ళికి ఒప్పుకుంటావని అనుకోలేదు. అసలు నా మీద ఇష్టం తోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా..? బావ. లేదంటే చెప్పు డాడీకి నేను చెప్తాను. అంటూ యామిని లోపలికి వెళ్లిపోతుంటే.. రాజ్, యామినిని ఆపి అంకుల్ ను ఇబ్బంది పెట్టొద్దు అంటాడు. దీంతో యామిని కానీ నువ్వు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు కదా..? నిజంగా నా మీద ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకంటున్నావా..? లేదా నాకేమీ అర్తం కావడం లేదు బావ. అని అడుగుతుంది. దీంతో రాజ్ ఇష్టమే.. నీ మీద ఉన్న ఇష్టంతోనే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అని చెప్తాడు.
రాజ్ మాటలకు దూరం నుంచి వింటున్న కావ్య ఏడుస్తుంది. యామిని మాత్రం హ్యాపీగా అవునా..? ఏదీ ప్రామిస్ చేయ్ అని అడుగుతుంది. రాజ్ ప్రామిస్ చేస్తాడు. దీంతో యామిని థాంక్యూ బావ థాంక్యూ సో మచ్.. ఇప్పుడు నేను నీ భార్యగా నీ లైఫ్ పార్టనర్‌గా ఫీలవుతున్నాను. ఈ క్షణం కోసమే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను అంటుంది. కావ్య ఏడుస్తూ.. దేవుడిని చూస్తూ ఏంటి స్వామి ఇది ఆయన ప్రాణాలు కాపాడి ఇలా దగ్గర చేస్తావు అనుకునేలోపే అందనంత దూరం పంపించేస్తున్నావా..? ఏంటి స్వామి ఇది ఎందుకిలా..? అంటూ బాధపడుతుంది.
తర్వాత రాత్రికి ఇంటికి వెళ్లిన తర్వాత అప్పు ఏంటి బావ వాళ్లంత ఎవరు అని అడుగుతుంది. అసలు అక్కడ ఉన్నది మన బావే అని నమ్ముతున్నావా..? అని అడుగుతుంది. దీంతో కావ్య నా మనసు నన్ను మోసం చేయదు అప్పు ఆయన మీ బావగారే.. అని చెప్తుంది. దీంతో అప్పు.. అయితే ఇంకెందుకు అక్కా ఆలోచికస్తున్నావు. వాళ్ల మీద కేసు పెట్టి నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. కోర్టులో వాళ్లు చేసిందంతా బయట పెట్టి మన బావను మనం తీసుకొచ్చేద్దాం అంటుంది. దీంతో ఆ ఆలోచన నాకు లేదనుకున్నావా..? కానీ అలా చేస్తే మనమే నష్టపోతాం. అంటుంది కావ్య. తప్పు చేసింది వాళ్లైతే మనం ఎందుకు నష్టపోతాం అని అప్పు అడగ్గానే.. డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తు చేస్తుంది కావ్య. ఒక ప్లాన్ ప్రకారం వెళితేనే మనం మీ బావ గారిని రక్షించుకోగలం అని తన ప్లాన్ చెప్తుంది కావ్య. ఇద్దరు కలిసి యామిని భరతం పట్టేందుకు రెడీ అవుతారు.
రాజ్, యామిని వాళ్ల ఫాథర్ దగ్గరకు వెళ్లి అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. పర్వాలేదు బాబు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు. సడెన్ గా మీకు ఇలా జరిగే సరికి చాలా టెన్షన్ పడిపోయాను అంకుల్ అటాడు. ఏం కాలేదు కదా బాబు అంటాడు యామిని ఫాథర్. మీరు ఇన్నేళ్లుగా నన్ను తండ్రిలాగా చూసుకున్నారని యామిని చెప్పింది. అలాంటిది మీకైమైనా జరిగితే తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అంకుల్. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో.. అంటాడు. లేదు అంకుల్ బయటి ప్రపంచాన్ని చూస్తున్నాం కదా..? మన అనుకున్న వాళ్ల కోసం ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని పరాయి వాళ్లుగా చూస్తున్న రోజులు ఇవి అలాంటిది మీరు ఇన్నేళ్లుగా నన్ను చూసుకుంటున్నారు అంటే రియల్లీ చాలా గ్రేట్ అంటాడు రాజ్.
పాపం రాజ్, యామిని మాటలు మొత్తం నమ్మి నన్ను మంచి వాడిలా చూస్తున్నాడు. కానీ నేనేమో తనని మోసం చేస్తున్నాను. అని మనసులో అనుకుంటాడు యామిని ఫాథర్. ఇంతలో రాజ్ తనకు యామిని కాకుండా నాకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా..? ఎందుకంటే నిన్నొక అమ్మాయి ఫోన్ చేసి నేను గుర్తు లేనా..? అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది. అంటూ చెప్పగానే.. యామిని ఫాథర్ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో వైదేహి వచ్చి అదేం లేదని ఎంత మంది అడిగినా యామిని నీకు ఇష్టం అని చెప్తుంది. దీంతో రాజ్ సరే అంటీ అంటూ వెళ్లిపోతుంది.
మరోవైపు కావ్య దేవుడి ముందు నిలబడి ఏడుస్తుంది. ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది నువ్వే సాల్వ్ చేయాల్సింది కూడా నువ్వే.. నువ్వు కనక నాకు హెల్ప్ చేయకపోతే నీ నామాన్ని శతకోటి సార్లు రాసి నీ ముందే జపిస్తాను అంటుంది. ఇంతలో రాజ్, కావ్యకు మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చూసిన కావ్య హ్యపీగా ఆయనే మెసేజ్ చేశారు కృష్ణయ్యా.. యామినితో పెళ్లి పెట్టుకుని నాకు మెసేజ్ పెట్టారంటే ఆయనకు పెళ్లి ఇష్టంలేదని అర్తం అనుకుని బెడ్ రూంలోకి వెళ్లి రాజ్‌కు రిప్లై ఇస్తుంది. దీంతో ఇద్దరి మధ్య చాటింగ్ నడుస్తుంది. చాటింగ్ లో అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత రాజ్, కావ్యను ఒకసారి కలుద్దామని అడుగుతాడు. కావ్య సరే అంటుంది. రాజ్ నుంచి రిప్లై రాదు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?