Nani : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్లో నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన నాని. అది తక్కువ కాలంలోనే నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే నాని కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోకుండా, నచ్చిన ప్రతి కథను చేసుకుంటూ వెళ్ళాడు. వరుసగా ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అలానే డిజాస్టర్ సినిమాలు కూడా మధ్యలో పడ్డాయి. ఆహా కళ్యాణం, పైసా వంటి సినిమాలు వరుస డిజాస్టర్ లు అయ్యాయి. వారం రోజు గ్యాప్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలు నాని కెరీర్ ని బాగా డౌన్ చేసేసాయి. అంతేకాకుండా నాని బర్త్డే మంత్ లో ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం యాదృచ్ఛికం. ఇక నాని విషయానికి వస్తే ప్రస్తుతం వరుస హిట్ సినిమాలు తో కెరియర్లో ముందుకు దూసుకుపోతున్నాడు.
బ్యాడ్ టైమ్స్ లో వాళ్లకు కాల్ చేస్తా
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. వరుస హిట్ సినిమాలు వచ్చిన తర్వాత రెండు డిజాస్టర్ సినిమాలో వస్తే ఆ హీరోని ట్రీట్ చేసే విధానం కంప్లీట్ గా మారిపోతుంది. ఆహా కళ్యాణం, పైసా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ రెండు సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదని నాని చాలా బాధగా తన ఆఫీసులో కూర్చుంటే బాహుబలి టీం వచ్చి నాని బర్తడేను సెలబ్రేట్ చేసింది. ఆ విషయం నానికి ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంటుంది అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. నాని తన బ్యాడ్ టైమ్స్ లో ఉన్నప్పుడు మొదటి కాల్ చేసే వ్యక్తి రానా దగ్గుబాటి, అల్లరి నరేష్, ఎన్టీఆర్ వీళ్ళందరితోపాటు ప్రభాస్ తో కూడా మంచి పరిచయం ఉంది.
వరుస హిట్ సినిమాలు
జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు వలన కొన్ని సినిమాలకు ఊహించిన కలెక్షన్స్ రాలేదు కానీ మామూలుగా అయితే నాని చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉంది. ఇక ప్రస్తుతం నాని టైం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి. చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ఒకవైపు హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ 3 సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. థియేటర్స్ కు ఆడియన్స్ రావడం మానేశారు అనుకునే తరుణంలో ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా వస్తారు అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా హిట్ 3. ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా త్వరలో 100 కోట్ల మార్కెట్లో చేరనుంది.
Also Read : Trivikram Srinivas: స్క్రిప్టు లాక్ అయింది, రిలీజ్ ఎప్పుడు అంటే.?