Tollywood movies : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో సినిమా మామూలుగా ఉంటే సరిపోవట్లేదు. ఆడియన్స్ కి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు చూడడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉండేది. కేవలం థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అలానే టీవీ చానల్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వీటన్నిటిని దాటి థియేటర్ వరకు వెళ్లి సినిమా చూడాలి అంటే దానికంటే ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతున్నాయి. అలానే కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ రావడం కూడా గగనం అయిపోయింది. కొన్నిచోట్ల మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరైన ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాయి.
ఆ బాధ్యత దర్శక, నిర్మాతలదే
ఇక ఇదే విషయంపై సింగిల్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందన్నారు. అయితే, మార్పును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. పలు కారణాల వల్ల థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందనే మాట సినీ పరిశ్రమలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు నిర్మాతలు స్పందించగా.. తాజాగా అల్లు అరవింద్ (Allu Aravind) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటీటీకి అలవాటు పడిన ఆడియన్స్‌నూ థియేటర్లకు రప్పించేలా సినిమాలు రూపొందించాల్సిన బాధ్యత దర్శక, నిర్మాతలకు ఉందన్నారు. ‘#సింగిల్’ (#Single) ట్రైలర్ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.
Also Read : Nandamuri Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్.. పంచకట్టులో తండ్రిని తలపిస్తున్న సీనియర్ హీరో
కంటెంట్ ఇంపార్టెంట్
ప్రస్తుతం చాలామంది యూత్ ప్రతి లాంగ్వేజ్ లో సినిమాలు చూడటం మొదలుపెట్టారు. అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టి మరి మిగతా భాషలో మంచి కాన్సెప్ట్ సినిమాలను చూస్తున్నారు. కేవలం చూడటం మాత్రమే కాకుండా ఆ సినిమా బాగుంటే దాని గురించి పదిమందికి చెబుతున్నారు. అలా మిగతా వాళ్ళు కూడా చూడటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో థియేటర్ కు వచ్చి ఒక సినిమా చూడాలి అంటే, ఎంత ప్రమోట్ చేసినా కూడా కంటెంట్ ఆకట్టుకునేలా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అందుకే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడక్కడ చిన్నచిన్న సినిమాలు బిగ్గెస్ట్ హిట్గా మారుతున్నాయి.
Also Read : Vijay Deverakonda: రౌడీ హీరోకు బిగ్ షాక్.. సారీ చెప్పాలంటూ గిరిజనులు డిమాండ్..!