Ileana D’Cruz : సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎవరికి ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పడం కష్టం.. అలాగే ఎవరు ఎన్ని రోజులు ఇండస్ట్రీలో ఉంటారు అనే విషయాన్ని కూడా చెప్పలేదు. ఒకప్పుడు తమకంటూ ఒక స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకొని.. తీరిక లేకుండా సినిమాలు చేస్తూ బిజీ గా మారిన ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు సడన్గా ఇండస్ట్రీకి దూరమై అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో కరెంటు తీగ లాంటి నడుముతో అందరి హృదయాలను దోచుకున్న ఇలియానా (Ileana D’Cruz) కూడా ఒకరు. తన నటనతో, అందంతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఇలియానా.. ఇప్పుడు అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. అటు ఇండస్ట్రీకే కాదు ఇప్పుడు సోషల్ మీడియాకి కూడా దూరంగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. దీంతో అటు నెటిజన్స్ కూడా ఇలియానా మిస్సింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు .మరి అసలు ఏమైందో ఇప్పుడే చూద్దాం.
కోటి రూపాయలు అందుకున్న తొలి హీరోయిన్ గా రికార్డ్..
గోవా బ్యూటీ ఇలియానా.. 2006లో వచ్చిన ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్డం అందుకున్న ఈమె.. ఆ సినిమాలో స్లిమ్ లుక్ ,గ్లామర్, ట్రెండీ కాస్ట్యూమ్స్ తో ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కట్టారు. ఇక తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్డం అందుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు సైతం తిరగరాసింది. ఈ సినిమా విజయం సాధించడంతో ఇలియానా రేంజ్ కూడా మారిపోయింది. అంతేకాదు ఒక్కో సినిమాకి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని సంచలనం సృష్టించింది. ఇలాంటి ఈమె టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ కి వెళ్ళాక మరింత సన్నబడడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో మళ్లీ 2018లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ అవకాశాలు రాలేదు.
ఇలియానా మిస్సింగ్.. టెన్షన్ లో ఫ్యాన్స్..
ఇక కరోనా సమయంలో పెళ్ళికి ముందే గర్భవతి అయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఈ విషయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే సరిగ్గా బిడ్డ పుట్టే నాలుగు నెలలకి ముందు.. 2023లో మైఖేల్ డోలాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు నెలలకు మగ బిడ్డకు జన్మనిచ్చింది ఇలియానా. ఇక ఈ ఏడాది మొదట్లో మళ్లీ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే అప్పుడప్పుడు సినిమాలలో చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులకు అందుబాటులో ఉండే ఈమె.. గత మూడు నెలలుగా ఇంస్టాగ్రామ్ లో కూడా కనిపించడం లేదు. ఫిబ్రవరి 25వ తేదీన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను చివరిగా పోస్ట్ చేసిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో అభిమానులు కంగారు పడుతూ ..ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్‌కు అసలేమైంది అంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్న వేళ.. ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. ఇలియానా రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధం అయ్యిందని.. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుంటుందని ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇలియానా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోయేసరికి ఆమె అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. మరి ఇప్పటికైనా ఇలియానా టచ్లోకి వస్తుందేమో చూడాలి