Crow Playing Football With Boy: కాకి అనగానే మనకు.. కడవలో రాళ్లు వేసి నీళ్లు తాగిన తెలివైన కాకి కథ గుర్తుకు వస్తుంది. అదే సమయంలో నక్క మాయ మాటలు నమ్మి కావ్.. కావ్.. అంటూ నోటిలో రొట్టెముక్కను జారవిడుచుకున్న అమాయకపు కాకి స్టోరీ గురించి తెలిసింది. కానీ, ఇప్పుడు కాకులు కూడా మోడ్రన్ గా మారిపోయాయి. మనుషులకు తామేం తక్కువ కాదంటున్నాయి. తాజాగా ఓ కాకి ఏకంగా ఓ అబ్బాయితో కలిసి ఫుడ్ బాల్ ఆడేసింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?
ఫుడ్ బాల్ ఆడుతున్న క్రేజీ కాకి
రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ కాకి వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఓ ఇంటి వరండాలో ఓ అబ్బాయి రెడ్ బాల్ తో ఆడుతుండగా, ఓ కాకి వచ్చింది. ఆ అబ్బాయి ఆ బాల్ ను దాని వైపు తంతాడు. నిజానికి కాకి వెంటనే పారిపోవాలి. కానీ, అది వెళ్లకుండా, తన ముక్కుతో ఆ బాల్ ను ఆ అబ్బాయి వైపు నెట్టింది. మళ్లీ ఆ అబ్బాయి బాల్ ను కాకి వైపు తన్నాడు. అలా ఇద్దరూ కాసేపు ఫుడ్ బాల్ ఆడుతూ కనిపించారు. కుటుంబ సభ్యులు ఈ వీడియోను షూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో సౌత్ గోవాలో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: ప్రీ మాన్ సూన్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్లేసెస్ అస్సలు మిస్ కాకండి!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా ఫీలవుతున్నారు. అందరూ కాకి చలాకీ తనానికి భలే ముచ్చటపడుతున్నారు. ఆహా ఎంత బాగా ఫుట్ బాల్ ఆడుతుందో అని కామెంట్స్ పెడుతున్నారు. మనిషి కంటే, కాకి చాలా బాగా ఆడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ అబ్బాయికి భలే క్రేజీ ఫ్రెండ్ దొరికిందంటున్నారు. ఇకపై దానితో ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకోవచ్చంటున్నారు. ‘ఈ కాకి గత జన్మలో ఫుడ్ బాల్ ప్లేయర్ అయి ఉంటుంది” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “ఇలాంటి కాకి నాకూ ఒకటి దొరికితే బాగుండు. రోజూ దానితో టైమ్ పాస్ చేసే వాడిని” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఫుట్ బాల్ అనేది గోవా గాలిలోనే ఉంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘క్రౌయిస్టానో రొనాల్డో’ అని అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. పలువురు నెటిజన్లు ఈ కాకిని టాప్ ఫుట్ బాల్ ప్లేయర్స్ తో పోల్చుతున్నారు.
Read Also: జపాన్ లో చెట్లను నరకరు.. వేరే చోటకు తరలిస్తారు, దీని వెనుక పెద్ద కథే ఉంది!