Dhoom 4 Update:ధూమ్(Dhoom).. ఇప్పటికే వరుసగా మూడు ఫ్రాంచైజీలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ధూమ్, ధూమ్2, ధూమ్3 ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇందులో ధూమ్ 2 కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సైతం క్రియేట్ చేసింది. ఇక అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ధూమ్ 3 , హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ధూమ్ 2 రేంజ్ లో విజయం సాధించకపోయినా.. ఫ్రాంచైజీ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే రాబట్టింది. ఇకపోతే ధూమ్ చిత్రంతో జాన్ అబ్రహం (John Abraham) ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిస్తే, అతడి నెగటివ్ పాత్ర అందరిని ఆకట్టుకుందిఅదే బాటలో అమీర్ ఖాన్ కూడా నెగిటివ్ పాత్ర పోషించారు. ఫస్ట్ రెండు భాగాలకు సంజయ్ గద్వి(Sanjay gadhvi) దర్శకత్వం వహించగా.. అమీర్ ఖాన్ నటించిన మూడో భాగానికి మాత్రం విజయ్ కృష్ణ ఆచార్య (Vijay Krishna Acharya) దర్శకత్వం వహించారు.
ధూమ్ 4 కి కాస్టింగ్ చిక్కులు..
ఇక ఇప్పుడు ధూమ్ ఫ్రాంచైజీ నుంచి ధూమ్ 4 కూడా రాబోతోందని సమాచారం. ఈసారి కూడా ‘యష్ రాజ్ ఫిలిం’ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. కానీ ఈ సినిమా తారాగణం విషయంలో బ్యానర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి అనే డైలమా చాలా కాలంగా కొనసాగుతోందట. నెగిటివ్ ఉన్న కీలక పాత్ర కోసం ఇప్పటికే రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ను ఎంపిక చేసుకొని యూనిట్ ముందుకు సాగుతోంది. యానిమల్ (Animal ) లాంటి పాన్ ఇండియా సినిమాతో హిట్టు కొట్టిన రణబీర్ కి ధూమ్ 4 లో అవకాశం ఇవ్వడం అందరిని సంతోషపరిచింది. అయితే మొదటి మూడు భాగాలలో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అయితే ఈ పాత్రతో ఆయన గుర్తింపు రాకపోయినా.. స్టైలిష్ గా కనిపించేందుకు ప్రయత్నం చేశారు .అయితే ఇప్పుడు ఆ పాత్రను ఒక దక్షిణాది హీరోకి ఆఫర్ చేస్తారని, గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రభాస్, అల్లు అర్జున్ ని పరిశీలిస్తున్న మేకర్స్..
ఇప్పటికే పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) ను యష్ రాజ్ బ్యానర్ వారు గత కొన్నాళ్లుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది కన్ఫామ్ కాలేదు మరొకవైపు ‘పుష్ప’ ఫ్రాంచైజీతో సంచలన విజయం అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ని ఈ పాత్ర కోసం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ హీరోలకే ఛాలెంజ్ విసురుతున్న ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లకు ఇలాంటి అవకాశం కల్పిస్తే వారు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఇందులో నెగెటివ్ షేడ్ పాత్రలో అవకాశం కల్పించుంటే ఖచ్చితంగా ఈ పెద్ద స్టార్లు ఓకే చెప్పేవారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం వీరు ముందడుగు వేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభాస్ లేదా అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.