BigTV English

Pushpa 3 Update: సమంత, శ్రీ లీలా కాదు.. అంతకుమించి.. ఐటమ్ బ్యూటీపై దేవీ శ్రీ కామెంట్స్..!

Pushpa 3 Update: సమంత, శ్రీ లీలా కాదు.. అంతకుమించి.. ఐటమ్ బ్యూటీపై దేవీ శ్రీ కామెంట్స్..!

Pushpa 3 Update:బాక్స్ ఆఫీస్ వద్ద ‘పుష్ప-2’ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. పుష్ప -2 విడుదలై 50 రోజులు పూర్తయినా కూడా బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 సినిమా హడావిడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించి ఇంకా 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేశారు. అయితే రూ.2000 కోట్లు కలెక్షన్సే టార్గెట్ గా ఈ సినిమాకి మరో 20 నిమిషాలు యాడ్ చేశారని తెలుస్తోంది.అయితే పుష్ప-1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్ప-2 అంతకన్నా ఎక్కువ హిట్ అయింది. అయితే దీనికి సీక్వెల్ గా పుష్ప-3 ర్యాంపేజ్ కూడా ఉంటుంది అని సినిమా చివర్లో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక పుష్ప-3 గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అలాగే పుష్ప-3లో విలన్ గా విజయ్ దేవరకొండ(Vijay devarakonda) నటిస్తారని, లేదు ఫహాద్ ఫాసిల్ (Fahad fazil) మళ్ళీ కనిపిస్తారని, జగపతిబాబు (Jagapathi babu) నటిస్తారు అంటూ ఇలా ఎన్నో రూమర్లు తెరపైన వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.


పుష్ప -3 లో బాలీవుడ్ బ్యూటీ..

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా పుష్ప-3 సినిమా గురించి ఒక మంచి అప్డేట్ ఇచ్చారు ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad).. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar), దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ల ప్రయాణం ‘ఆర్య’ సినిమా నుండి కొనసాగుతోంది.అయితే ‘పుష్ప2’ సినిమా సమయంలో దేవిశ్రీకి బన్నీ సుకుమార్ తో కాస్త గ్యాప్ ఏర్పడ్డప్పటికీ పుష్ప 2 హిట్ తో ఆ గ్యాప్ కాస్త పోయిందని అర్థమవుతుంది.అయితే తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్.. పుష్ప-3 కి సంబంధించి, ఫ్యాన్స్ హ్యాపీ అయ్యే అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటికే విడుదలైన పుష్ప -1, పుష్ప-2 లో స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేశారు. అలా కిస్సిక్ పాటలో శ్రీలీల (Sreeleela)మెరవగా, ఉ అంటావా పాటలో సమంత(Samantha)మెరిసింది. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లే కాదు పక్కా లోకల్ తో కాజల్ అగర్వాల్(Kajal agarwal),జిగేల్ రాణి తో పూజ హెగ్డే(Pooja hegde).. ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ తన మ్యూజిక్ డైరెక్షన్లోనే ఐటెం సాంగ్స్ చేశారు.అది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్లు నేను ఇచ్చిన మ్యూజిక్ ద్వారానే ఐటెం సాంగ్స్ చేయడం ప్రారంభించారు. ఇక పుష్ప-3 ఐటెం సాంగ్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం..


గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..

జాన్వీ కపూర్ కి సంబంధించిన డ్యాన్స్ వీడియోలు నేను గతంలో కొన్ని చూశాను. ఆమె చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఇక తల్లి శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వి కపూర్ లో కూడా కనిపించింది.అందుకే పుష్ప-3 లో ఐటమ్ సాంగ్ కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని నా నమ్మకం. అలాగే నేను ఎప్పుడూ కూడా అసాధారణమైన డాన్సర్లనే ఎంచుకుంటాను. అలాగే ఇప్పుడున్న హీరోయిన్లలో డాన్స్ చేసే వారిలో సాయి పల్లవి (Sai Pallavi) అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు.అయితే పుష్ప 2 హడావిడి ఇంకా ముగియక ముందే పుష్ప-3 కి సంబంధించి ఐటెం సాంగ్ లో జాన్వీ కపూర్ సెట్ అవుతుంది అని దేవిశ్రీప్రసాద్ చెప్పడంతో చాలామంది నెటిజన్లు పుష్ప-3 కి కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తారు. కాబట్టి ఇప్పటికే పుష్ప-3 ఐటెం సాంగ్ కి సంబంధించి షూటింగ్ అయిపోయింది కావచ్చు. అందుకే దేవిశ్రీప్రసాద్ ఇలా హింట్ ఇస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు.

పుష్ప 3 కి మరింత ఆలస్యం..

ఇక ఈ విషయం పక్కన పెడితే..అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చే పుష్ప-3 ఇప్పట్లో వచ్చేలా లేదు. ఎందుకంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్సి 17 సినిమా చేసే పనిలో పడ్డారు. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు.అలాగే అల్లు అర్జున్ కూడా వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ ఇలా ఎంతోమంది డైరెక్టర్లతో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు.అందుకే పుష్ప-3 ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.కానీ పుష్ప-3 పై దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన అప్డేట్ మాత్రం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×