BigTV English

Boyapati Srinu : సార్ ఐజాక్ న్యూటన్… ఈసారి కూడా ఇలాంటి అద్భుతాలు ఉంటాయా…?

Boyapati Srinu : సార్ ఐజాక్ న్యూటన్… ఈసారి కూడా ఇలాంటి అద్భుతాలు ఉంటాయా…?

Boyapati Srinu : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ కు ఒక మార్క్ ఉంటుంది. వాళ్ళు స్టార్ హీరోలతో తెరకెక్కించే సినిమాలు కూడా తమ మార్క్ ను చూపించేలా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా రాజమౌళి సినిమాలు. ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు. అలాగే ఇప్పుడు బోయపాటి శ్రీను పేరు కూడా వినిపిస్తుంది. మాస్ , యాక్షన్ కథలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఈయన చేసిన ప్రతి సినిమా మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా బాలయ్యతో సినిమాను అనౌన్స్ చేసాడు . ఆ సినిమా పై నందమూరి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు . సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై నెట్టింట ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమా స్టోరీ గురించి గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.


అఖండ 2 గ్రాండ్ లాంచ్ ..

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాల్గవ సినిమాగా ‘అఖండ 2’ తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తెరపైకి వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒక దానికి మించి ఒకటి అన్నట్టుగా బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు నాలుగవసారి బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న ‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది . ఈ మూవీని నవంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం . వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది .


బోయపాటి పై అప్పుడే మొదలైన ట్రోల్స్ ..

బోయపాటి సినిమాల్లో హై రేంజు లో యాక్షన్ సీన్స్ ఉంటాయి. హీరోకు సెట్ కానీ కొన్ని సీన్లు ఆయన సినిమాల్లో చూసాము. గతంలో కొన్ని సినిమాలకు ట్రోల్స్ కూడా వచ్చాయి. అఖండ సినిమా విషయంలో కూడా ట్రోల్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఫిజిక్స్ అందని యాక్షన్ సీన్స్ ఉంటాయి… బాలయ్య తో చేసే సినిమాలో అయితే అవి చాలా ఎక్కువగా ఉంటాయి… ఈ భారీ యాక్షన్ సీన్స్ వల్ల బోయపాటి ట్రోల్స్ కి గురి అవుతున్నారు… ఇప్పుడు కూడా ఇలాంటి యాక్షన్స్ పెట్టి ట్రోల్స్ కి గురవుతాడా ? లేక బాలయ్యలో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపిస్తాడా అన్నది తెలియాల్సి. అటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ విషయం లో టెన్షన్ పడుతున్నారు . బాలయ్య ఎఫెక్ట్ కాకుండా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి బోయపాటి మైండ్ లో ఎలాంటి ఆలోచన ఉందో.. ఇకపోతే బాలయ్య 109 వ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి . సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×