BigTV English

Prithviraj Sukumaran : లూసిఫర్ 2 ఎఫెక్ట్… పృథ్విరాజ్‌కు ఐటీ నోటీసులు..?

Prithviraj Sukumaran : లూసిఫర్ 2 ఎఫెక్ట్… పృథ్విరాజ్‌కు ఐటీ నోటీసులు..?

Prithviraj Sukumaran : పృధ్విరాజ్ సుకుమారన్ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు కానీ ఇప్పుడు మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా చూడడం అలవాటైపోయింది. అలా కొన్ని సినిమాలు నచ్చే ప్రాసెస్లో ఆ నటుడు వర్క్ గురించి కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అలా పృథ్విరాజ్ కు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. తెలుగులో నటించే అవకాశం ఎప్పుడో ఉన్న కూడా పృథ్వీరాజ్ సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా మంచి పేరుని సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్.


పృథ్వి రాజ్ కి నోటీసులు

పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన లూసీ ఫర్ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయింది. అదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ కూడా చేశారు. ఇక ఎన్నో అంచనాలతో మధ్య వచ్చిన లూసిఫర్ 2 సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడుగా ఉన్న పేరును కొంతమేరకు చెడగొట్టింది అని కూడా చెప్పాలి. ఇక ప్రస్తుతం పృథ్వీరాజ్ రీసెంట్ టైమ్స్ లో చేసిన సినిమాల గురించి వాటి రెమ్యునరేషన్స్ గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఇన్కమ్ టాక్స్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వార్త మలయాళం ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది.


పృథ్వీరాజ్ డెడికేషన్

సినిమా కోసం కొంతమంది దర్శకులు కొంత టైం ని కేటాయిస్తారు. ఇంకొంతమంది దర్శకులు ఒక కథను చెప్పడానికి సంవత్సరాలు పాటు ప్రయాణం చేస్తారు. తెలుగులో ఒక సినిమాను తెరకెక్కించడానికి ఎక్కువ టైం తీసుకునే దర్శకులు అంటే ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. సినిమా తీయడానికి రాజమౌళి ఎక్కువ టైం తీసుకున్న కూడా ఆ సినిమా చివరిగా ఆడియన్స్ కి సంతృప్తిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే మలయాళం లో ఒక సినిమా దాదాపు 10 ఏళ్ల పాటు నిర్మితమైంది.పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ఈ చిత్రం ‘ఆడుజీవితం’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా జరిగే ప్రాసెస్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కి చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా కోసం వాటిని కూడా వదులుకున్నాడు పృథ్వీరాజ్.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి చేసిన సైరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ కాస్ట్ నటించారు. అమితాబచ్చన్ విజయ్ సేతుపతి వంటి నటులు కూడా ఈ సినిమాలో చేశారు. అయితే ఈ సినిమా కోసం మలయాళం యాక్టర్ పృధ్వీరాజ్ సుకుమారన్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి సంప్రదించారట. అయితే దానికి పృధ్వీరాజ్ సర్ ప్రస్తుతం నేను ఒక సినిమా చేస్తున్నాను. ఇప్పుడు నాకున్న టైం లో మీతో కలిసి పని చేయలేను కానీ మీతో పని చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసాకే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా.?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×