AR Rahman: ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Ai) ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తు అంతా ఏఐ మయం కాబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి రంగంలోనూ, కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఏఐ ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సినీ రంగంలోను దీని వాడకం పెరిగిపోయింది. సినిమా గ్రాఫిక్స్ లోను, ప్రత్యేకమైన యాక్షన్స్ సన్నివేశాలలో వాడుతున్నారు. ఇప్పుడు ఏఐతో దివంగత గాయకుల వాయిస్ ని కూడా రీ క్రియేట్ చేస్తున్నారు. దీనిపై ప్రముఖ గాయకుడు ఆస్కార్ విన్నర్, ఏఆర్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అదే ఆందోళన..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వినియోగంపై ఇప్పటికే కొంతమంది నిపుణులు, దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఏఐ గురించి మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ ఎంతో శక్తివంతమైనది. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. దీనిలో మంచి, చెడు రెండు ఉన్నాయి. మంచి కోసం దీన్ని ఉపయోగించుకోవాలి కానీ, కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. టెక్నాలజీ వాడకంతో పాటు దానికి కొంత నియంత్రణ కూడా అవసరం ఉంది. ఏఐతో గాయకుల పాటలను రీ క్రియేట్ చేస్తున్నారు. చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లుగా క్రియేట్ చేసి వదులుతున్నారు. ఇలా చేయడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. దీనిపై నియంత్రణ అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఏఆర్ రెహమాన్.
స్వర మాంత్రికుడు ..
తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఏ ఆర్ రెహమాన్ 1999లో వచ్చిన ప్రేమికుల రోజు నుండి ఓకే బంగారం వరకు ప్రతి ఆల్బమ్ అద్భుతం అని చెప్పచ్చు.మ్యూజిక్ ను రకరకాల మ్యూజిక్స్ తో మిక్స్ చేసి పాటలను అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా స్వర మాంత్రికుడిగా క్లాసిక్ నుంచి పాప్ సాంగ్స్ వరకు అన్ని రకాల పాటలను మిక్స్ చేసి మ్యూజిక్ చేయడ ఏఆర్ రెహమాన్ ప్రత్యేకత. గత ఏడాది తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లాల్ సలాంలో దివంగత గాయకులు బాంబ భక్యా, షాహుల్ హమీద్ వాయిస్ ను ఏఐతో క్రియేట్ చేశారు. వారు అంతకుముందు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో పాటలు పాడిన వారే. వారు లేకపోవడంతో ఒక పాటను రీ క్రియేట్ చేయడం కోసం వారి కుటుంబం నుండి అనుమతి తీసుకొని ఏఆర్ రెహమాన్ ఏఐ టెక్నాలజీ తో రీ క్రియేట్ చేశారు. రీసెంట్ గా తెలుగులో మాస్ మహారాజ్ సినిమాలో దివంగత గాయకుడు చక్రి పాడిన పాటను ఆయన వాయిస్ తో రీ క్రియేట్ చేశారు.
Faria Abdullah : ట్రోమా లేదు ఏం లేదు… కామెడీ కోసం చెప్పా అంతే.. కవర్ చేసుకున్న చిట్టి