BigTV English
Advertisement

Kapil Sharma : ఇండియాలోనే రిచెస్ట్ టీవీ స్టార్..ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే?

Kapil Sharma : ఇండియాలోనే రిచెస్ట్ టీవీ స్టార్..ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే?

Kapil Sharma : తెలుగులో కమెడీయన్స్ అంటే బ్రహ్మీ పేరు ఎలాగైతే వినిపిస్తుందో అలాగే బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న బాలీవుడ్ స్టార్ కమెడీయన్ అంటే కపిల్ శర్మ పేరే వినిపిస్తుంది. భారతీయ స్టాండప్ కమెడీయన్, నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాత జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇక అదే ఏడాదిలో ఫోర్బ్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది. అయితే తాజాగా కపిల్ శర్మ ఆస్తుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


ఇండియన్ టెలివిజన్‌ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఈయనే.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు సంపాదిస్తాడని , ఇది రూపాలి గంగూలీ, అనుపమలో తన పాత్ర కోసం ఎపిసోడ్‌కు రూ. 3 లక్షలు తీసుకుంటున్నాడు. తేజస్వి ప్రకాష్ వంటి ప్రముఖ తారల సంపాదన కంటే ఎక్కువగా కపిల్ శర్మ అందుకున్నట్లు తెలుస్తుంది. ‘ది కపిల్ శర్మ షో’ హోస్ట్ గా చేసేందుకు కపిల్ శర్మ ప్రతి ఎపిసోడ్ కు రూ. 5 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. అతను దేశంలోనే అత్యంత ధనిక TV స్టార్‌గా నిలిచాడు. ఇటీవలి నివేదికల ప్రకారం అతని మొత్తం నికర విలువ రూ. 300 కోట్లుగా అంచనా వేయబడింది.

కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ..


కపిల్ మొదటిసారిగా 2007లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించి అందరిని ఆకట్టుకున్నాడు. అతను 2013లో కామెడీ నైట్స్ విత్ కపిల్, 2016లో ది కపిల్ శర్మ షోకి హోస్ట్‌గా బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ ప్రముఖులు క్రమం తప్పకుండా కనిపించడంతో షో యొక్క ప్రజాదరణ విపరీతంగా పెరిగింది.. సీనియర్ కమెడీయన్స్ మించిన ఆస్తులను సంపాదించుకున్నాడు.

కపిల్ శర్మ నెట్ వర్త్..

ముంబైలోని అంధేరీలో రూ.15 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లో కపిల్ తన కుటుంబంతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతను చండీగఢ్ సమీపంలో రూ. 25 కోట్ల విలువైన ఫామ్‌హౌస్‌ను కూడా కొనుగోలు చేసారు.. సమయం దొరికినప్పుడు ఫ్యామిలి తో అక్కడకు వెళ్లి గడుపుతారు..

ఖరీదైన కార్ల కలెక్షన్..

ఈయనకు కార్లు అంటే చాలా ఇష్టం. మార్కెట్ లోకి వచ్చే కొత్త కార్లను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఈయన దగ్గర వోల్వో ఎక్స్‌సి 90, మెర్సిడెస్-బెంజ్ ఎస్ 350, రేంజ్ రోవర్ ఎవోక్ మరియు రూ. 5.5 కోట్లతో కస్టమ్-డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ ఉన్నాయి.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, టీవీ షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాల కన్నా టీవీ షో ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నారని తెలుస్తుంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×