BigTV English

OTT Movie : పాపపై అఘాయిత్యం, తండ్రిపై అనుమానం.. చిన్నా, మహారాజా లాంటి కిక్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పాపపై అఘాయిత్యం, తండ్రిపై అనుమానం.. చిన్నా, మహారాజా లాంటి కిక్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్దిరోజులలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో సక్సెస్ అయినవి కానీవి కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.పెద్ద సినిమా లతో పాటు కొన్ని చిన్న సినిమాలుకూడా ఈమధ్య థియేటర్లలలో మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మూవీ లవర్స్ కు మంచి కుటుంబ కథా చిత్రాలను, థ్రిల్లర్ సినిమాలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఓ సస్పెన్స్ తో కూడిన ఓ కుటుంబ కథా చిత్రం. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో, స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.


చిన్నా, మహారాజా లాంటి కిక్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

ఒక తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలతో ఈ మూవీ ని చిత్రీకరించాడు దర్శకుడు. ఈ మూవీ పేరు “మజాయతు” (Mazhayathu). ఈ మూవీలో సన్నివేశాలు చాలా సున్నితంగాను, మనసుకు హత్తుకునే విధంగానూ ఉంటాయి. ఇదివరకే ఇటువంటి కథాంశంతో సినిమాలు వచ్చినా ఈ మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో  స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

అనిత, వేణుగోపాల్ అనే దంపతులు ఉంటారు. వీరికి ఉన్ని అనే ఒక కూతురు ఉంటుంది. తండ్రికి కూతురు అంటే చాలా ఇష్టం. కూతురు కి కూడా తండ్రి అంటే చాలా ప్రేమ. వేణుగోపాల్ ప్రతిరోజు తన కూతురిని స్కూల్ కి తీసుకొని వెళ్తుంటాడు. అలాగే ప్రతి విషయాన్ని తనతో పంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు హఠాత్తుగా స్కూల్ నుంచి వేణుగోపాల్ కి ఫోన్ వస్తుంది. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని స్కూల్ యాజమాన్యం చెప్తారు. తర్వాత తండ్రి స్కూల్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటి దగ్గర తాళం వేసి తన భార్య బయట వెళ్లి ఉంటుంది. భార్య లేటుగా రావడంతో తనమీద కోప్పడి కూతురికి ఆరోగ్యం బాగో లేకుంటే బయట ఏం చేస్తున్నావని కేకలు వేస్తాడు. వాళ్ల కూతురు మంచం మీద పడుకొని లేచిన తర్వాత తండ్రి ఆ మంచం వైపు చూస్తాడు. ఆ మంచానికి బ్లడ్ మరకలు అంటుకుని ఉంటాయి. కూతురు పెద్దమనిషి అయిందని భావిస్తాడు.

ఆ తరువాత తెలిసిన విషయం ఏమిటంటే కూతురుపై ఎవరో అఘాయిత్యం చేసి ఉంటారు. ఇది తెలుసుకున్న తల్లి తండ్రి మీద కూడా అనుమానం పడుతుంది. ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురికి జరిగిన అన్యాయాన్ని చెప్తుంది. తన భర్త మీద కూడా అనుమానం ఉందని చెప్తుంది. పోలీసులు ఆమెతో అంత ఘోరంగా కూతురిని ఏ తండ్రి రేప్ చేయడు అని చెప్పి, అనుమానితులను మేం పట్టుకుంటాం అని తల్లికి చెప్పి కంప్లైంట్ తీసుకొని పంపుతారు. ఇంతకీ వేణుగోపాల్ కూతురిని ఎవరు రేప్ చేశారు? ఆ రేపిస్టుని పోలీసులు పట్టుకుంటారా ? ఇందులో తండ్రికి సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “మజాయతు” (Mazhayathu)ని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న సినిమానే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు కంటతడి కూడా పెట్టిస్తాయి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×