Viral Video: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, సామాన్యులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఇలా ప్రతీ ఒక్కరి వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఏదైన వినూత్న ఘటన జరిగిందంటే అది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే తాజాగా ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఖాకీలు అయి ఉండి పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉండగానే డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు చేశారు. దీనిపై అధికారులతో సహా నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు చిందులు వేస్తూ పిచ్చి చేష్టలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కానిస్టేబుల్ తో కలిసి మహిళా పోలీసులు అధికారిణి చిందులు వేశారు. ప్రాంతీయ భాషకు సంబంధించిన ఓ హిట్ పాటకు జోరుగా స్టెప్పులు వేశారు. డ్యాన్సులు చేస్తూ పోలీస్ స్టేషన్లోనే హంగామా సృష్టించారు. అయితే తాము విధుల్లో ఉన్నామని, స్టేషన్లోనే ఇలాంటి పనులు చేస్తున్నామనే ధ్యాసలో లేకుండా చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇద్దరూ కలిసి డ్యాన్స్ లు చేస్తుండగా అంతలోనే ఓ సీనియర్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దీంతో మహిళా ఆఫీసర్, అధికారిని చూడగా.. కానిస్టేబుల్ మాత్రం చిందులు వేస్తూ మరింత రెచ్చిపోయాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ం అతడికి సైగలు చేస్తూ ఆపాలని ప్రయత్నించింది. అయినా కూడా కానిస్టేబుల్ అలాగే డ్యాన్స్ చేస్తూ అధికారిని చూశాడు. అనంతరం డ్యాన్స్ ఆపేసి, క్షమాపణలు చెప్పడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న వారు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
తొలుత వారిని చూసి సీరియస్ గా ఉన్న ఆఫీసర్ కూడా చివరకు వారితో కలిసి సరదాగా స్టెప్పులేశారు. దీంతో కానిస్టేబుల్ సహా, మహిళా పోలీసు అధికారిణి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ వీడియో నెట్టిం వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో పోలీసులు కూడా సాధారణ మనుషుల్లాగే వారికి కూడా ఎంజాయ్ చేసే టైం కావాలని, వారు చేసిన దాంట్లో తప్పేం లేదని సమర్థిస్తున్నారు. మరోవైపు కొందరేమో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
View this post on Instagram