బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్…
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ సంచలనం. అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే 9 1990 లో రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులను నెలకొల్పింది. ఇన్ని దశాబ్దాలు అయినా సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారంటే.. మెగాస్టార్ శ్రీదేవి కాంబో క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ విడుదలైనప్పుడు టికెట్ రేటు కేవలం 6 రూపాయలు మాత్రమే ఉంది. అప్పట్లో సినిమా మొదటి మ్యాట్నీ షో, నుండి బ్లాక్ మార్కెట్లో టికెట్ను అమ్మేవారిట, 6 రూపాయలు ఉన్న టికెట్ 210 రూపాయలకి బ్లాక్ లో అమ్ముడయ్యాయి. టికెట్టు ధరకి 40 రెట్లు ఎక్కువ పెట్టి మరి ఈ సినిమా చూసారు.. ఎవ్వరు ఊహించని దానికన్నా ఎక్కువ మొత్తంలో అమ్ముడవడంతో అప్పట్లో ఈ సినిమా క్రేజ్ అలాంటిది అని మనకు అర్థమవుతుంది. ఈ సినిమాలోని పాటలు అన్నీ మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. అబ్బనీ తీయని దెబ్బ అనే పాట ఐకానిక్ పాట. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ పాటను ఒక్కరోజులోనే కంపోజ్ చేశామని, ఈ విషయం తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతారని చెప్పారు. ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభించి పాటని మధ్యాహ్నం పూర్తి చేసామని చిరంజీవి తెలిపారు. ఈ పాట గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. కథ ప్రకారం హీరో ఒక సామాన్యమైన వ్యక్తి, హీరోయిన్ దేవకన్య, వారిద్దరి మధ్య ప్రేమను తెలియజేయాలంటే ఓ సమర్థవంతమైన పాట కావాలి అని ఈ ఐకానిక్ పాటను కంపోస్ట్ చేశాము అని ఆయన తెలిపారు.
ఆ పాటకోసం అయన కష్టం ..
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలోఓ పాటకోసం ఎంతో కష్టపడ్డారని 106 డిగ్రీల జ్వరంతోను షూటింగ్ కు వచ్చారని, శ్రీదేవి రెండు రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇవ్వడంతో, ఆ రెండు రోజుల్లోనే ఆయన పాట పూర్తి చేయాల్సి ఉండగా, షూటింగ్ కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ తర్వాత ఆయన హాస్పిటల్లో చేరి 15 రోజుల తర్వాత డిస్చార్జ్ అయ్యారు అని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ ను ఇళయరాజా అందించారు. ఈ చిత్రం మే 9న 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 15 కోట్లు వసూలు సాధించి చిరంజీవి సినిమాల్లోనే ఎక్కువ వసూల్ సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. అప్పట్లోలోనే ఈ చిత్రానికి 5 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ సినిమా మే 9న రి రిలీజ్ కానుంది.