
Ram Charan : రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడం కొంత షాకింగ్ అనిపించింది. ఎందుకంటే.. అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ ఈమధ్య కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు.. పవన్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ నడుస్తోందనీ గట్టిగానే పుకార్లు వినిపించాయి. ఇక మెగా ఫ్యాన్స్‌ను కాదని తనకంటూ సొంతంగా అల్లు ఆర్మీని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాడని కూడా వినిపించింది. పలు సందర్భాల్లో ఇవి అబద్దాలు కావు నిజమేనేమో అనిపించే ఘటనలు కూడా జరిగాయి.
రామ్ చరణ్ పుట్టినరోజును అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా సరిగ్గా స్పందించలేదు. ఆ మధ్య చెప్పను బ్రదర్ అనే మాట కూడా పవన్ కల్యాణ్ గురించే. సో, ఆ దెబ్బతో మెగా ఫ్యాన్స్ అల్లును పట్టించుకోవడం మానేశారు. ఆ మధ్య చిరంజీవిపైనా ట్వీట్ చేశాడు. అయితే, ఇవన్నీ జరిగిన తరువాత అవన్నీ అబద్దాలే అని అనిపించేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. చెప్పను బ్రదర్ అన్న తరువాత ఓ సందర్భంలో పవన్ ను కౌగిలించుకొని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు బన్నీ. మరో సందర్భంలో చిరంజీవిని కౌగలించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇప్పుడు రామ్ చరణ్ ఇంటికి వెళ్లి ఉపాసన సీమంత వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ ఫొటోలు కూడా షేర్ చేసుకున్నాడు. సో, మెగా కుటుంబంతో తనకు ఎప్పటిలానే మంచి రిలేషన్స్ ఉన్నాయని, ఫ్యామిలీ ఫ్యామిలీనే.. సినిమా సినిమానే అనే రీతిలో అల్లు సాగిపోతున్నాడని రీసెంట్ యాక్షన్‌తో తేలిపోయింది. నిజంగా అలాగే ఉండాలి కూడా. బయట ఎవరెన్ని మాట్లాడుకున్నా… అదంతా గడప బయటే ఉండాలి. ఇంట్లోకి వస్తే.. బాబాయ్, బావ, మామయ్య అంటూ సర్దుకుపోవాలి.
అదేంటో మంచు ఫ్యామిలీలో ఇదే మిస్ అవుతోంది. పేరుకు క్రమశిక్షణతో పెంచానని చెప్పుకుంటుంటారు మోహన్ బాబు. కాని, విష్ణు, మనోజ్, లక్ష్మీ చూస్తే అలా కనిపించడం లేదు. మొన్న మంచు మనోజ్ పెళ్లి జరిగితే… జస్ట్ గెస్ట్‌లా వచ్చి వెళ్లిపోయాడు విష్ణు. ఆ తరువాత విష్ణు గొడవ పడిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. మొన్న మీడియా వాళ్లు గొడవ గురించి అడిగితే.. సెగ్గడ్డ, గోకుతావా అంటూ మనోజ్ తింగర సమాధానాలు ఇచ్చాడు. బయట ఎన్ని గొడవలున్నా… ఫ్యామిలీ విషయానికొస్తే మాత్రం కలిసిపోవాలనే లాజిక్.. మంచు ఫ్యామిలీ మరిచిపోయినట్టు కనిపిస్తోంది. అదే మెగా ఫ్యామిలీని చూడండి… ఎంతలా కలిసిపోయారో.