Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ గా ఎదిగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తరువాత రవితేజ పేరునే చెప్పుకొస్తారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన రవితేజ.. హీరోగా మారి, మంచి మంచి కథలను ఎంచుకొని మాస్ మహారాజాగా ఎదిగాడు. రవితేజ కూడా మెగాస్టార్ లానే తన తమ్ముళ్లను ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం చేశాడు. కానీ, వారు ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది.
రవితేజ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ కొడుకు మహాధన్.. రాజా ది గ్రేట్ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చదువుపై ఫోకస్ చేసిన మహాధన్.. ఇంకోపక్క నటనలో, డైరెక్షన్ లో శిక్షణ తీసుకుంటున్నాడట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ కొడుకు మాత్రమే కాకుండా కూతురు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Sobhita Akkineni: రాయల్ లుక్ లో అక్కినేని కోడలు.. ఏమైనా ఉందా.. అసలు
రవితేజ కుమార్తె మోక్షధ.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నదట. అయితే హీరోయిన్ గా కాకుండా దర్శకత్వం వైపు అమ్మడు ఎక్కువ మక్కువ చూపుతుందని సమాచారం. ఈ మధ్యనే మోక్షధ.. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన సితార ఎంటర్ టైన్మెంట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యిందని టాక్.
రవితేజ సైతం మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. హీరోగా మారిన విషయం తెల్సిందే. ఇక తండ్రిలానే మోక్షధ కూడా దర్శకత్వ శాఖలోనే మెళుకువలు నేర్చుకోవాలని ప్రయత్నిస్తుందంట. ఈమధ్య వారసులను విదేశాలకు పంపించి.. డైరెక్షన్ లో అనేక కోర్స్ చేయిస్తున్నారు స్టార్స్.
సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్.. రజినీ నటించిన బెస్ట్ మూవీస్ అంటే ఇవేరా..
రవితేజ అలా కాకుండా.. పని ఏదైనా దగ్గరుండి నేర్చుకుంటేనే వస్తుందని భావించి.. మోక్షధను సితార ఎంటర్ టైన్మెంట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేశాడట. కష్టం విలువ తెల్సినవాడే.. పిల్లలకు కూడా ఆ కష్టం విలువ తెలిసేలా పెంచుతాడు. ఇప్పుడు రవితేజ కూడా అదే చేస్తున్నాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. కేవలం డైరెక్షన్ లో మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో మెళుకువలు నేర్చుకోమని రవితేజ చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏ చిన్నది డైరెక్టర్ గా మారనుంది.
అయితే ఫ్యాన్స్ మాత్రం మోక్షధ హీరోయిన్ గా మారితే బావుంటుందని అంటున్నారు. మరి మోక్షధ.. డైరెక్టర్ నుంచి హీరోయిన్ గా మారుతుందా.. ? లేక దర్శకత్వంలో రాణిస్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక రవితేజ కెరీర్ విషయానిస్తే.. విజయాపజయాలను లెక్కచేయకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు.
Game Changer: ‘ గేమ్ ఛేంజర్ ‘ రన్ టైం అంత తక్కువా? శంకర్ ప్లాన్ ఇదా..?
ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా ఒక మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు. మరి వచ్చే ఏడాది రవితేజ.. ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.