BigTV English

Vadhuvu Trailer : రహస్యాలను చేధించే వధువు.. ఆసక్తి రేపుతున్న ట్రైలర్..

Vadhuvu Trailer : రహస్యాలను చేధించే వధువు.. ఆసక్తి రేపుతున్న ట్రైలర్..

Vadhuvu Trailer : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యాక్టర్ అవికా గోర్. సీరియల్ తో మంచి క్రైస్ట్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఉయ్యాల జంపాల మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ ,ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ తో తిరిగి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.


రీసెంట్ గా అవికా.. Mansion 24 అనే వెబ్ సిరీస్ లో నటించి తన సత్తా చాటుకుంది. ఇప్పుడు ప్రేక్షకులను తిరిగి అలరించడానికి వధువు అని సరికొత్త వెబ్ సిరీస్ తో వస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో అవికాతో పాటు నందు, అలీ రెజాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ పోలూరు డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రోమోను శనివారం (నవంబర్25) విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా.. ఉత్కంఠత రేపే విధంగా ఉంది ఈ ప్రోమో. ఇందులో అంచనాలను మించిన ట్విస్టులు మైండ్ బ్లాంక్ చేసే విధంగా ఉన్నాయి.

మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ అని పెట్టిన క్యాప్షన్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ పై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే.. వేయి అబద్ధాల ఆడి పెళ్లి చేయాలి అంటారు కానీ.. ఈ పెళ్లిలో అన్ని రహస్యాలే ..అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. మంగళ స్నానం చేయిస్తున్న అవికా బ్యూటిఫుల్ లుక్స్ తో ఈ వీడియో మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లగా ఇంట్లో జరుగుతున్న ఎన్నో రహస్యాల గురించి క్లూస్ ఇస్తూ వీడియో ముందుకు సాగుతుంది.


అవికా కోసం వచ్చిన సారెలో పనసకాయ మధ్యలో ఉమ్మెత్త ఆకులు పెట్టి కుట్టి పంపుతారు. ఈ విషయంపై ఇంట్లో పెద్ద డిస్కషన్ జరుగుతుంది.. ఆ తర్వాత అవికా ఆ ఆకు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అది విషపూరితమైన ఆకు అని తెలుసుకొని ఆమె షాక్ అవుతుంది. తర్వాత పనసకాయ కుట్టడానికి ఉపయోగించిన సూదిని చేతిలో పట్టుకొని ఇదంతా ఎవరో కావాలని చేసినట్లు ఉంది అని ఆమె అనుకోవడం.. సిరీస్ పై మరింత ఆసక్తి రేపే విధంగా ఉంది. పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఇంట్లో అడుగడుగునా రహస్యాలే.. ఎటు చూసినా ప్రమాదమే.. మరి ఈ నవ వధువు వాటిని ఎలా పరిష్కరిస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఎలా కనుగొంటుంది.. అనేది వెబ్ సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×