BigTV English

Peanuts Benefits : పల్లీలతో ఆరోగ్యం పదిలం

Peanuts Benefits : పల్లీలతో ఆరోగ్యం పదిలం
Peanuts Benefits

Peanuts Benefits : ఎంతైనా శీతాకాలం కదా! ఒకటే చలి. ఈ చల్లటి వాతావరణంలో గరం గరం పల్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ కాలంలో పల్లీలు తినడం మంచిదేనని లవిస్తున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు.


వేరుశెనక్కాయల్లో ప్రొటీన్లు, హెల్దీ ఫాట్స్, కార్పొహైడ్రేట్లు ఎక్కువ. వీటిని తింటే సత్వర శక్తి లభిస్తుంది. చలి వాతావరణంలో మన శరీరం వెచ్చగా ఉండాలంటే అధిక శక్తినిచ్చే పల్లీలు తినడమే బెస్ట్ అని చెబుతున్నారు.

విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్‌ బాగుండాలంటే ఈ పోషకాలే కీలకం. అప్పుడే శీతాకాలం వ్యాధులను ఎదుర్కొనే సత్తా శరీరానికి లభిస్తుంది.


పీనట్స్‌లోని మోనోశాచ్యురేటెడ్, పాలీఅన్‌శాచ్యురేటెడ్ ఫాట్స్‌తో గుండెకు ఎంతో బలం. చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. వింటర్‌లో అతి శీతల వాతావరణం కార్డియోవాస్క్యులర్ సిస్టమ్‌పై అదనపు ఒత్తిడిని కలగజేస్తుంది. పల్లీలను తీసుకోవడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవాలి.

మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే నియాసిన్, రిస్వెరిట్రాల్, విటమిన్-ఇ పీనట్స్‌లో పుష్కలం. అల్జీమర్స్ నుంచి ఇవి మనల్ని కాపాడతాయి. జీవక్రియ సాఫీగా ఉండాలంటే మాంగనీస్ అవసరం. ఈ మినరల్ పల్లీల్లో లభ్యమవుతుంది. చలి వాతావరణం మన చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. విటమిన్-ఇ అధికంగా పల్లీలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×