Rahul Dev:ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మరణాన్ని ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా ఈయన మరణం పై ఈయన సోదరుడు ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ స్పందించారు.. “ముకుల్ దేవ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. ముకుల్ దేవ్ నిన్న రాత్రి న్యూఢిల్లీలో చాలా ప్రశాంతంగా జీవితాన్ని ముగించారు. ముకుల్ మన మధ్య లేకపోయినా ముకుల్ కూతురు సీయా దేవ్ రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటాడు. మేమంతా ముకుల్ ను చాలా మిస్ అవుతున్నాము. దయచేసి అందరూ తదుపరి జరిగే అంత్యక్రియలకు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు హాజరుకావాలని కోరుతున్నాను” అంటూ తెలిపారు రాహుల్ దేవ్.
ముకుల్ దేవ్ మరణానికి కారణం ఇదే…
తాజాగా బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన తన 54 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ముకుల్ దేవ్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు.అలా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ముకుల్ దేవ్ తెలుగులో పలు హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. అయితే అలాంటి ముకుల్ దేవ్ మరణం పై తాజాగా ఆయన సోదరుడు రాహుల్ దేవ్ తన సోషల్ మీడియా లో ఓ సంచలన పోస్ట్ పెట్టారు. మరి ఇంతకీ ముకుల్ దేవ్ మరణం పై సోదరుడు రాహుల్ దేవ్ పెట్టిన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
బ్రదర్ రాహుల్ దేవ్ ఏమన్నారంటే..
బాలీవుడ్ నటుడు అయినటువంటి ముకుల్ దేవ్ దస్తక్ అనే మూవీతో హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కేవలం హిందీలోనే కాకుండా కన్నడ,తెలుగు, పంజాబీ సినిమాల్లో కూడా ముకుల్ దేవ్ రాణించారు.అలా ముకుల్ దేవ్ తెలుగులో రవితేజ హీరోగా చేసిన కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్, ప్రభాస్ తో ఏక్ నిరంజన్, నాగార్జున భాయ్ వంటి సినిమాలలో విలన్ పాత్రల్లో నటించారు. అలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ముకుల్ దేవ్ నిన్న రాత్రి మరణించడంతో ఆయన సోదరుడు రాహుల్ దేవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేశారు.. నా సోదరుడు ముకుల్ దేవ్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన్ని బతికించుకోవడానికి కూతురు సియాదేవ్ ఎంతగానో ప్రయత్నించింది.కానీ చివరికి కన్నుమూశారు. ముకుల్ దేవ్ నిన్న రాత్రి న్యూఢిల్లీలో చనిపోయారు. ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి.
తెలుగు మూవీస్ లో.. అన్న ,తమ్ముళ్లు ..
ఈ అంత్యక్రియల్లో మాతో కలిసి పాల్గొనాలి అంటూ రాహుల్ దేవ్ తన సోదరుడి మరణం పై ఒక పోస్ట్ చేశారు. ఇక తల్లిదండ్రులు మరణించాక ఒంటరితనాన్ని అనుభవించిన ముకుల్ దేవ్ చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు.. ముకుల్ దేవ్ మరణంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తో పాటు ఆయనతో కలిసి వర్క్ చేసిన చాలా మంది సెలబ్రిటీలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈరోజు సాయంత్రం 5:00 గంటలకి ఆయన అంత్యక్రియలు ఉంటాయని ముకుల్ దేవ్ సోదరుడు రాహుల్ దేవ్ తన పోస్టులో తెలియజేశారు. ఇక రాహుల్ దేవ్ కూడా తెలుగులో అతడు, సీతయ్య, సింహాద్రి వంటి సినిమాల్లో నటించారు.