BigTV English

Item Song in OG : ఓజీలో ఐటెం సాంగ్… స్టార్ బ్యూటీతో.. పవన్‌కి ఎఫెక్ట్ లేకుండా ప్లాన్..?

Item Song in OG : ఓజీలో ఐటెం సాంగ్… స్టార్ బ్యూటీతో.. పవన్‌కి ఎఫెక్ట్ లేకుండా ప్లాన్..?

Item Song in OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత ఆయన నుంచి వచ్చే సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అభిమానుల కోరికను తీర్చడానికి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుజీత్ (Sujeeth ) దర్శకత్వంలో వస్తున్న ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ‘(OG) సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.


ఓజీ లో కూడా స్పెషల్ సాంగ్.. కానీ?

డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హస్మి (Imran Hashmi), ప్రియాంక అరుణ్ మోహన్(Priyanka Arun Mohan), ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రియా రెడ్డి (Shriya Reddy) తో పాటు ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu ) నటిస్తుండడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ పై పడకుండా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఓజీ లో కూడా ఐటెం సాంగ్ ఉంటుందని.. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో నడిపించడానికి మిల్కీ బ్యూటీ తమన్నాను రంగంలోకి దింపబోతున్నారని సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ కనిపించకపోవచ్చు. విలన్ తో జరిగే ఒక సందర్భంలో ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అందుకే పవన్ ఇమేజ్ తగ్గట్టుగా ఆయనను ఈ స్పెషల్ సాంగ్ నుంచి తప్పించి, విలన్ ని ఆ స్పెషల్ సాంగ్లో పెట్టేలా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేశారట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ స్పెషల్ సాంగ్ ను హీరో శింబు పాడినట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


పవన్ కళ్యాణ్ సినిమాలు..

ఇకపోతే పవన్ కళ్యాణ్ మరో సినిమా విషయానికి వస్తే.. ఈయన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Hareesh Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించారు. ఎప్పుడో ఈ సినిమా ప్రకటన అయితే అయ్యింది కానీ.. ఆఖరికి ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ చేతులు పట్టుకున్నట్టుగా ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తూ త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ ప్రకటించారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ మూడు చిత్రాలతో పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మంచి విందు వడ్డివ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు.

also read:Dilraju: ఏంటి.. ఆర్య 3 టైటిల్ బన్నీ కోసం కాదా.. ఆయనతో చేస్తే వర్కౌట్ అవుతుందా..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×