BigTV English

Dilraju: ఏంటి.. ఆర్య 3 టైటిల్ బన్నీ కోసం కాదా.. ఆయనతో చేస్తే వర్కౌట్ అవుతుందా..?

Dilraju: ఏంటి.. ఆర్య 3 టైటిల్ బన్నీ కోసం కాదా.. ఆయనతో చేస్తే వర్కౌట్ అవుతుందా..?

Dilraju:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లో బిగ్గెస్ట్ కల్ట్ లవ్ స్టోరీ గా నిలిచిన చిత్రం ఆర్య (Arya). ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత తన రెండవ సినిమాగా చేసిన చిత్రం ఇది. 2004 మే 7వ తేదీన విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కు భారీ విజయాన్ని అందించింది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో అనురాధ మెహతా(Anuradha mehta) హీరోయిన్ గా.. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dilraju) నిర్మించారు. ఈ చిత్రం అల్లు అర్జున్ కి భారీ విజయాన్ని అందివ్వడమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా ‘ఆర్య 2’ కూడా వచ్చింది. 2009 నవంబర్ 27న విడుదలైన ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.


ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు..

ఇదిలా వుండగా.. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆర్య 3 కూడా ఉంటుందని గతంలో సరదాగా ప్రకటించారు సుకుమార్ (Sukumar ) కానీ ఇప్పుడు ఆ విషయాన్ని దిల్ రాజు నిజం చేయబోతున్నారు. ఇప్పటికే ఆర్య 3 టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.. ఇలా ఆర్య 3 టైటిల్ ను రిజిస్టర్ చేయించారో లేదో అప్పుడే అభిమానులలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం యాక్షన్ , మాస్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. పైగా పాన్ ఇండియా హీరో కాబట్టి అలాంటి తరహాలోనే సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అట్లీ (Atlee ), త్రివిక్రమ్ (Trivikram ) వంటి దిగ్గజ దర్శకులతో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తున్న అల్లు అర్జున్ మళ్లీ ఇప్పుడు ఇలాంటి సినిమా చేస్తారా? అని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ టైటిల్ బన్నీ కోసం కాదా.. వర్కౌట్ అవుతుందా?
.

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు ఈ ఆర్య 3 టైటిల్ ని అల్లు అర్జున్ కోసం కాకుండా తన అన్నయ్య కొడుకు శిరీష్ కోసం రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఈ సినిమాకి కథ మాత్రమే సుకుమార్ ఇస్తున్నారు.ఈ సినిమాను సుకుమార్ శిష్యులు చేసే ఛాన్స్ ఉంది అని సమాచారం. గతంలో శిరీష్ కోసం సుకుమార్ ‘సెల్ఫిష్’ అనే మూవీ కథ ఇచ్చాడు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ, మధ్యలోనే ఆగిపోయింది. అందుకే ఈసారి శిరీష్ తో ఒక సినిమా చేయాలనుకున్న సుకుమార్ ఈసారి కూడా చేసే అవకాశం లేదనే చెప్పాలి. కేవలం ఎప్పటిలాగే కథను అందిస్తాడు. కానీ ఆయన శిష్యులలో ఒకరు ఈ సినిమాని తెరపై ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే లవ్ మీ, రౌడీ బాయ్స్ చిత్రాలతో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న శిరీష్ అల్లు అర్జున్ స్థానాన్ని భర్తీ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంత క్యారెక్టర్ వైట్ ను శిరీష్ మోయగలరా అని కూడా అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ మూవీ ని శిరీష్ తో చేస్తే ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. అంతేకాదు అభిమానులు ఊరుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

also read:Ram Gopal Varma : సెన్సార్ అంటే ఓ స్టుపిడ్ థింగ్… సినిమాలో బూతులు ఉండొద్దు అనడానికి వాళ్లు ఎవరు..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×