Team India: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్లుగా వారి హవాను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి అనుష్క శర్మ ఒకరు. అనుష్క శర్మ అనేక సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎవ్వరు పొందని గుర్తింపును అనుష్క అందుకుంది. కోట్లాది సంఖ్యలో ఈ చిన్న దానికి అభిమానులు ఉన్నారు. ఇక అనుష్క తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. అనుష్క సినిమాల పరంగా తన కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ క్రికెట్ తో ప్రేమలో పడింది.
Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?
అతను మరెవరో కాదు విరాట్ కోహ్లీ. వీరిద్దరూ మొదట ఓ యాడ్ షూట్ సమయంలో కలిసారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. ఆ క్షణం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకోవడం, బయటికి వెళ్ళడం ఎంజాయ్ చేయడం ఇలాంటివి చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న అనుష్క, కోహ్లీ కుటుంబ సభ్యుల సమక్షంలో 2017లో వివాహం చేసుకున్నారు. మీరు ఇటలీలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. వివాహం తర్వాత కోహ్లీ ఎప్పటిలానే మ్యాచ్లు ఆడారు. అనుష్క శర్మ సినిమాలలో నటించింది. అనంతరం అనుష్క శర్మ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2024లో బాబు పుట్టాడు.
ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. రీసెంట్ గానే కోహ్లీ టి20లు, టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు ఎప్పటిలానే ఆడతారు. ప్రస్తుతం అనుష్క కోహ్లీ దంపతులు లండన్ లో ఉంటున్నారు. అనుష్క సినిమాలకు పూర్తిగా దూరమైంది. సినిమాలలో నటించడం మానేసింది. అనుష్క స్టార్ హీరోయిన్ అయి ఉండి కోహ్లీ ప్రేమలో పడి సినిమాలకు పూర్తిగా దూరమైంది. దీంతో అనుష్క అభిమానులు చాలా బాధపడుతున్నారు. మళ్లీ ఎప్పటిలానే సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. కానీ అనుష్క మాత్రం కోహ్లీ కోసం సినిమాలకు దూరమై తన పూర్తి సమయాన్ని తన భర్త పిల్లలకు కేటాయించింది. దీంతో అనుష్కను చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
కాగా రీసెంట్ గానే జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. 18 సంవత్సరాల అనంతరం ఆర్సిబి జట్టు ట్రోఫీని పట్టుకుంది. దీంతో ఆర్సిబి అభిమానులు విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కొంత మంది ఆర్సిబి జట్టుపై విపరీతంగా ఫైర్ అయ్యారు. కోహ్లీ ఈ విషయంపైన పెద్దగా రియాక్ట్ అవలేదని సీరియస్ అయ్యారు.