Jabardasth: బుల్లితెరపై దశాబ్ద కాలం పైగా ప్రసారమవుతూ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్(Jabardasth) కామెడీ షో ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవ్వటమే కాకుండా ఇండస్ట్రీలో వారికంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పటికి ఈ కార్యక్రమం సరికొత్త వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులను ప్రతివారం ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ రష్మికి జబర్దస్త్ టీం గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి.
జబర్దస్త్ లోకి కొత్త యాంకర్…
ఇక ఈ ప్రోమోలో భాగంగా జడ్జెస్ కుష్బూ, కృష్ణ భగవాన్ ఎప్పటిలాగే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక కుష్బూ మాట్లాడుతూ ఇకనుంచి జబర్దస్త్ కార్యక్రమం కొత్తగా ఉండబోతుందని తెలిపారు. ఎనర్జీ డబల్, ఎంటర్టైన్మెంట్ డబల్, ఎవరిది డబల్ అంటూ కుష్బూ ఓ రేంజ్ లో ఈ కార్యక్రమం గురించి చెప్పేశారు. ఇక మరొక జడ్జ్ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జబర్దస్త్ కార్యక్రమం ఆడియన్స్ లో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలోని ఆడియన్స్ ఉన్నారు అంటూ చెప్పకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం షూటింగ్ సమయంలోనే కొంతమంది ఆడియన్స్ ని కూడా కొత్తగా అక్కడకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.
సుధీర్ రాబోతున్నారా…
ఇలా అన్ని డబల్ డబల్ అని చెప్పడంతో వెంటనే యాంకర్ రష్మీ అక్కడికి వచ్చి అన్ని డబులా అని అడగడంతో, అన్ని డబల్ అయినప్పుడు యాంకర్లు కూడా డబల్ గానే ఉండాలి కదా అంటూ కుష్బూ షాక్ ఇస్తుంది. దీంతో వెంటనే రశ్మి నన్ను తట్టుకొని నిలబడే వాళ్ళు ఇక్కడేవరు ఉన్నారు అంటూ మాట్లాడగా వెంటనే మరొక మేల్ యాంకర్ ను చూపిస్తారు అయితే అతని ఎవరు? ఏంటీ? అనేది ఫేస్ రివిల్ చేయకపోయినా అతని కటౌట్ చూస్తుంటే మాత్రం సుధీర్ తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి రాబోతున్నారని స్పష్టమవుతుంది. ఒకప్పుడు సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా ఉండేవారు కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి తప్పుకున్నారు.
ఇక జబర్దస్త్ కార్యక్రమాన్ని సరికొత్తగా ప్రారంభించబోతున్న నేపథ్యంలో తిరిగి సుడిగాలి సుదీర్(Sudheer) కూడా ఈ కార్యక్రమంలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ టీం లీడర్ గా కమెడియన్ గా పనిచేసిన విషయం తెలిసిందే. టీం లీడర్ గా ఉన్న సుదీర్ తిరిగి ఈ కార్యక్రమానికి యాంకర్ గా రాబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే సుధీర్ రాబోతున్నారా లేక మరెవరైనాన అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.. రష్మీ పక్కన సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తే మాత్రం జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్ భారీగా పెరిగిపోతుందని చెప్పాలి. సుధీర్ రష్మీ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు వీరిద్దరికీ అభిమానులు పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నిజజీవితంలో కూడా ఒక్కటైతే బాగుండు అంటూ అప్పట్లో వీరి గురించి భారీగా రూమర్లు వినిపించాయి.