Rapido Food Delivery: ఇప్పటి వరకు తక్కువ ఖర్చుతో ప్రయాణీకులకు గమ్యస్థానాలకు చేర్చిన రాపిడో, ఇకపై తక్కువ ధరలో కస్టమర్లకు ఫుడ్ డెలివరీ అందించబోతోంది. ఇకపై స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలకు గట్టి పోటీని ఇవ్వబోతోంది. కొత్తగా ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రాపిడో.. ఇటు కస్టమర్లకు, అటు రస్టారెంట్లకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే డెలివరీ ఛార్జీలను పెద్ద మొత్తంలో తగ్గించింది. స్విగ్గీ, జొమాటోను కోలుకోలేని దెబ్బకొట్టబోతోంది.
రాపిడో వైపు రెస్టారెంట్ల చూపు
ఇతర ఫుడ్ డెలివరీ యాప్స్ తో పోల్చితే ధరలు తగ్గించడంతో అన్ని రెస్టారెంట్లు రాపిడో వైపే చేస్తున్నాయి. ప్రస్తుతం పలు రెస్టారెంట్లు స్విగ్గీ, జొమాటో సంస్థలకు 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ చెల్లిస్తున్నాయి. అయితే, రాపిడో ఈ మొత్తాన్ని సగానికి తగ్గించింది. 8 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో హోటళ్లకు ఖర్చు సగానికి తగ్గి ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్న రెస్టారెంట్లు మొదలుకొని పెద్ద రెస్టారెంట్ల వరకు రాపిడో హాట్ ఫేవరెట్ గా మారిపోయింది.
కస్టమర్లకూ లాభం కలిగేలా రాపిడో నిర్ణయం
ప్రస్తుతం ఉన్న స్విగ్గీ, జొమాటోతో పోల్చితే రాపిడో తక్కువ ధరకే అత్యంత వేగంగా ఫుడ్ డెలివరీ అందిస్తుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు కూడా రాపిడోను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం రాపిడోలో రూ. 400 కంటె తక్కువ ఫుడ్ ఆర్టర్ చేస్తే, కేవలం రూ. 25 డెలివరీ ఛార్జీ తీసుకుంటుంది. రూ. 400 కంటే ఎక్కువ ఆర్టర్ చేస్తే రూ. 50 తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలతో పోల్చితే చాలా తక్కువగా ఉండటంతో కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రాపిడో నుంచే ఫుడ్ ఆర్టర్స్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
Read Also: ఇవన్నీ చూశాక కూడా పెళ్లి చేసుకోవాలని ఉందా? ఈ టిప్స్ తో మీ ప్రాణాలు సేఫ్!
బెంగళూరులో ట్రయల్స్, త్వరలో దేశ వ్యాప్తంగా విస్తరణ
రాపిడో ప్రస్తుతం తన సేవలను బెంగళూరుకు పరిమితం చేసింది. ఇక్కడ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. కస్టమర్లతో పాటు రెస్టారెంట్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో తన సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. బెంగళూరు తర్వాత చెన్నైలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాపిడో అమలు చేస్తున్న ధరలు చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లకు లాభదాయకంగా ఉందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ అభిప్రాయపడింది. చిన్నగా మెస్ నడుపుతున్నవారు, ఇళ్లలో నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసేవారు కూడా రాపిడో ద్వారా తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇటు రెస్టారెంట్లకు, అటు కస్టమర్లకు మేలు చేసేలా ధరలు నిర్ణయించిన రాపిడోను అభినందిస్తున్నారు.
Read Also: తెలంగాణలో మరో రెండు ఎయిర్ పోర్టులు, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?