Jabardasth Prasad: జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచ్ లతో ప్రేక్షకులను అలరించి.. కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ప్రస్తుతం వరుస షోస్ తో బిజీగా ప్రసాద్ ఈ మధ్యనే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న విషయం తెల్సిందే. గత కొంతకాలంగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో వెంటనే కొత్త కిడ్నీని అమర్చాలని వైద్యులు తెలిపారు. ఇక తనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం ప్రసాద్ చాలా కాలం ఎదురుచూశాడు.
మధ్యలో ప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిత్యం డయాలసిస్ చేస్తున్నా కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రావడంతో ప్రసాద్ బతుకుతాడో లేదో అనే భయం అందరిలోనూ ఉండేది. ఇక ఆ సమయంలోనే ప్రసాద్ భార్య సునీత సైతం తన కిడ్నీని దానం చేస్తానని ముందుకు వచ్చింది. అన్ని మ్యాచ్ అయినా.. చిన్న వయస్సు కావడంతో ఆమె కిడ్నీ ఇవ్వకూడదని వైద్యులు తెలుపడంతో ఆగిపోయింది. అయినా భర్తను బతికించుకోవడానికి ఆమె పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. అలా రెండేళ్ల క్రితం కిడ్నీ డోనర్ కోసం అప్లై చేస్తే.. గతేడాది ఆ డోనర్ దొరకడంతో ప్రసాద్ కు ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది.
Devara 2: ఎన్టీఆర్ దేవర 2 కోసం మేకర్స్ కష్టపడాల్సిందేనా?
ఇక ప్రసాద్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగి.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. కొన్నిరోజుల నుంచి వరుస షోస్ తో బిజీగా ఉన్న ప్రసాద్.. తాజాగా ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్ లో భార్యసునీతతో కలిసి పాల్గొన్నాడు. అందరిని నవ్వించే ప్రసాద్.. ఈ షోలో చాలా ఎమోషనల్ అయ్యాడు. తన భార్య తనను ఎంత బాగా చూసుకుందో అందరిముందు చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటివరకు ఏ భర్త చేయని పనిని స్టేజిమీద ప్రసాద్ చేసి చూపించాడు.
స్టేజిమీద ప్రసాద్ మాట్లాడుతూ.. ” ప్రతి భర్త జీవితంలో భార్య కీ రోల్ ప్లే చేస్తుంది. నా జీవితంలో నా భార్య సునీత అంతకన్నా ఎక్కువ. ఎవరైనా ప్రేమించినవాళ్లు కలిసి బతకాలని పెళ్లి చేసుకుంటారు. కేవలం నన్ను బతికించడానికి ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె చేసినదానికి నేను థాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియదు. తల్లిదండ్రులకు కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు. బాగోదు.. కానీ, నేను కూడా నా భార్యకు అదే చేయాలనుకుంటున్నాను” అంటూ స్టేజిమీద భార్య కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడు. ప్రగ్నెంట్ సమయంలో కూడా హాస్పిటల్ కు వెళ్లకుండా నన్నే చూసుకుంది అని ప్రసాద్ బోరున విలపించాడు. ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆలాంటి భార్య కాళ్లు కడిగినా తప్పు లేదు అని చెప్పుకొస్తున్నారు.