Shobhita dhulipala:సాధారణంగా హీరోయిన్స్ మచ్చలేని ముఖం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ.. అందాన్ని రెట్టింపు చేసుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) మాత్రం వంటింటి చిట్కాలే తన చర్మ సౌందర్యానికి ప్రధాన కారణం అంటూ చెబుతోంది. అంతేకాదు ప్రతిరోజు ఆ మూడు ఉండాల్సిందే అని, లేకపోతే కాలు బయట పెట్టనని కూడా తెలిపింది అక్కినేని కొత్త కోడలు. మరి ఈమె అందం వెనుక ఉన్న ఆ బ్యూటీ సీక్రెట్ ఇప్పుడు చూద్దాం..
అధరాలకు సహజసిద్ధమైన గులాబీరంగు దానితోనే..
అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళ మాట్లాడుతూ.. “కొన్ని కొన్ని సార్లు నా చర్మం సాధారణంగా, మరి కొన్నిసార్లు పొడిగా మారుతుంది. దీనివల్లే నా పెదాలు సీజన్ తో సంబంధం లేకుండా పొడి బారుతాయి. నేను కూడా అందరిలాగే మొదట్లో వివిధ రకాల బ్రాండ్లకు చెందిన లిప్ బామ్స్ వాడాను. కానీ ఉపయోగం లేదు. అదే సమయంలో నా పెదాలకు నెయ్యి రాసుకోవడం మొదలుపెట్టాను. వెంటనే మార్పు మొదలయ్యింది. అందుకే ఉదయం లేవగానే మొదట నేను చేసే పని నా పెదాలకు నెయ్యి రాసుకోవడమే. నెయ్యి రాశాక నా పెదాలకు కాసేపు మర్దన చేస్తాను. అందుకే ఆర్టిఫిషియల్ లిప్ బామ్ లకి బదులుగా పెదాలకు నెయ్యి రాసుకుంటే తేమతో పాటు సహజ సిద్ధమైన గులాబీ రంగును కూడా అందించవచ్చు అంటూ తెలిపింది.
చర్మం మృదుత్వానికి కొబ్బరినూనె ప్రధానం..
కాలం ఏదైనా సరే చర్మం పొడిగా, పొలుసుగా ఊడిపోతుంది. ఫలితంగా ఆయా చర్మ భాగాలలో దురద, మంట, చిన్నపాటి పొక్కులు వచ్చేస్తాయి. అలాంటప్పుడు నేను ప్రతిరోజు కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తాను. దీనివల్ల చర్మానికి పోషణ అందించి, తేమగా, మృదువుగా మార్చుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి ఇదే సౌందర్య పోషణలో ముఖ్య భాగమయ్యింది. అందుకే నేను కూడా నా జుట్టుకు శరీరానికి కొబ్బరినూనె ఉపయోగిస్తాను అంటూ తెలిపింది.
ఒత్తయిన కనుబొమ్మల కోసం ఆముదం..
“ఇక చాలామంది నా కనుబొమ్మలు చాలా ఒత్తుగా ఉన్నాయి అంటారు. ఇందుకు నేను ముందు నుంచి ఆముదం నూనెను ఉపయోగిస్తున్నాను. అటు నా జుట్టుకి కూడా హెయిర్ మిస్టును ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటాను. దీనికోసం కొబ్బరినూనెకు కొన్ని నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపుకొని జుట్టు పై స్ప్రే చేసుకుని, కాస్త మర్దన చేసుకుంటాను. ఫలితంగా జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా చిక్కులు కూడా పడవు. పైగా జుట్టు రాలడం కూడా ఆగిపోయింది ” అంటూ శోభిత తన చర్మ సౌందర్యానికి, కురుల సౌందర్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. మొత్తానికి అయితే నాగచైతన్య భార్య శోభిత ఈ మూడు ప్రతిరోజు కచ్చితంగా ఉపయోగిస్తానని చెప్పి లేడీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె త్వరలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు
Naa Anveshana : రేవంత్ అన్న చేసేది కరెక్ట్… HCU వివాదంపై నా అన్వేష్ కామెంట్స్..!