Ram Charan Little Fan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయనను హీరోగా అభిమానిస్తారు. ఆయన డైలాగ్స్ తో డాన్సులతో ఎంతోమంది ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. తాజాగా యాక్టర్ విశ్వ కుమారుడు రయాన్ రామ్ చరణ్ డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ఏకంగా ఆయనను కలిసే ఛాన్స్ కూడా కొట్టేసాడు. అంతేకాదు రామ్ చరణ్ తో ఫోటో దిగే ఛాన్స్ కొట్టేశాడు.. ఆ వివరాలు చూద్దాం ..
బుడ్డోడు భలే లక్కీ ..
మాటీవీలో ప్రసారమయ్యే కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం స్టార్ మా పరివార్. ప్రతి ఆదివారం సీరియల్స్ లోని నటులతో, సినీ నటులతో వినోదాన్ని ప్రేక్షకులకు పంచుతుంది ఈ షో. తాజాగా స్టార్ మా సమ్మర్ క్యాంప్ కాన్సెప్ట్ తో యాక్టర్ విశ్వ తనయుడు, సీరియల్ యాక్టర్ అంజలి కుమార్తె చందమామతో రయాన్ చేసే స్కిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వ తనయుడు రయాన్ సూపర్ టాలెంటెడ్ కిడ్. తాజాగా ఈ షోలో తనకెంతో ఇష్టమైన హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ఒక డైలాగ్ ను అచ్చం రామ్ చరణ్ చెప్పినట్టుగా చెప్పడంతో, అందరి దృష్టిని ఆకర్షించాడు రయాన్. ఈ ప్రోగ్రాంలో రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ మూవీ లాస్ట్ లో రామ్ చరణ్ చెప్పే డైలాగు ‘చిట్టిబాబు చెవిలో మాటలు వినపడడం కష్టం’ అనే డైలాగు పూర్తిగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ ఫోటోను తీసుకునే ఛాన్స్ ని కొట్టేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో రయాన్ ఫోటో దిగడంతో ఒక్క డైలాగుతో రామ్ చరణ్ తో ఫోటో కొట్టేసాడంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఒక్క డైలాగ్ తో ఫోటో కొట్టేశాడు..
స్టార్ మా పరివార్ ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో, రయాన్, డైలాగ్స్ డ్యాన్సులతో షోలో అలరించాడు. విశ్వ, రామ్ చరణ్ డైలాగ్ చెప్పమని అడగడంతో.. రయాన్ రంగస్థలం సినిమా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్ ని ఈజీగా చెప్పేస్తాడు. అది చూసి శ్రీముఖి క్లాప్స్ కొడుతుంది. అక్కడున్న వారంతా రయాన్ టాలెంట్ ని మెచ్చుకుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ చిట్టిబాబు దర్శకత్వం లో వస్తున్న పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే రిలీజ్ ఐన గ్లిమ్ప్స్ వీడియో తో మూవీ పై అంచనాలను పెంచేసింది. రయాన్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి ఆయనతో ఫోటో దిగడం, రామ్ చరణ్ పెద్ది మూవీ షూటింగ్ మధ్యలో చిన్ని ఫ్యాన్ తో ఫోటో దిగినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ బుడ్డోడు టాలెంట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని మెప్పించి ఆయనతో ఫోటో షేర్ చేసుకోవడం అంటే ఎంతో లక్కీ అని ఫ్యాన్స్ అంటున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు… మొత్తం తగలెట్టేలా ఉన్నారే…