Jagadeka Veerudu Athilokasundadi sundari Collections: ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలు మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతూ మరోసారి భారీ రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. అయితే ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి మరోసారి తన సత్తాను చాటుతూ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా అంతే రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొట్టేస్తుంది. మొదటిరోజు బాక్సాఫీసు షేక్ అయ్యేలా కలెక్షన్స్ ని వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేసింది. కొత్త సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు రెస్పాన్స్ ఎక్కువ రావడంతో మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మరి రెండో రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ..
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ కూడా ఒకటి.. ఈ సినిమాలో సరికొత్తగా చిరంజీవి కనిపించడంతో అప్పట్లో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. 1990 మే 9 న ప్రేక్షకుల ముందుకు రాగా భారీ విజయాన్ని అందుకుంది. తుఫాన్ ని సైతం తట్టుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టి చిరంజీవి, శ్రీదేవి, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2025 మే 9 కి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది.. ఈ మూవీకి ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు. మొదటి రోజు మంచి రెస్పాన్స్ రావడంతో పాటుగా కలెక్షన్స్ కు అదే విధంగా వసూల్ చేసింది. దాదాపు 1.75 కోట్ల వరకు వసూల్ చేసిందని సమాచారం.. రీరిలీజ్ లో కూడా ఈ మూవీ కోట్లు వసూల్ చెయ్యడం విశేషం.. ఇక రెండు రోజు కూడా భారీగానే వసూల్ చేసింది.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..
సినిమాకు ఖర్చు & కలెక్షన్స్..
ఈ మూవీని 3D లో చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. 35 ఏళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఇప్పటికీ రెస్పాన్స్ తగ్గలేదు. శ్రీదేవి అందాలను చూడాలో, అటు మెగాస్టార్ చిరంజీవి ని చూడాలో తెలియని సందిగ్దత ఏర్పడేలా చేసిందట ఈ చిత్రం. దీనిని బట్టి క్వాలిటీ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ఈ సినిమాకు 8 కోట్లను ఖర్చు చేశారు. ఫస్ట్ డే లోనే దీనికి దాదాపుగా 1.75 కోట్లు రాబట్టింది. అదే విధంగా రెండో రోజు కూడా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు రోజుల్లో కోటి 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందుకుంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి దాదాపుగా 4 కోట్ల వరకు వసూల్ చేసిందని టాక్.. ఈ కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు.. ఇదే జోరులో ఇంకా కొద్దిరోజులు కలెక్షన్స్ ను వసూల్ చేస్తుందేమో చూడాలి..