BigTV English

Indian Not Happy: ఇండియా కంటే పాకిస్తాన్ బెటర్.. ఆనందానికి దూరమవుతున్న భారతీయులు

Indian Not Happy: ఇండియా కంటే పాకిస్తాన్ బెటర్.. ఆనందానికి దూరమవుతున్న భారతీయులు

– సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ టాప్


– 2025 వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ విడుదల

World Happiness Report Indian Rank| జీవితాన్ని సంతోషంగా గడపాలని ప్రతీ మనిషి కోరుకుంటాడు. మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని వైద్యులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారనే అంశంపై ఐక్యరాజ్య సమితి ఒక సర్వే నిర్వహించింది. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2025 పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.


ఈ ఏడాది హ్యాపినెస్ ఇండెక్స్‌లో మొత్తం 147 దేశాలలో భారత దేశం 118వ స్థానంలో నిలిచింది. అయితే గత సంవత్సరం అంటే 2024లో ఇండియా 126వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకొని 118కి చేరింది. అయితే ఉక్రెయిన్, మొజాంబిక్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, పాలస్తీనా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, గాంబియా, వెనిజులా వంటి దేశాలు ఇండియా కంటే సంతోషంగా ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, యుద్దంతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌ ప్రజలు భారత్ కంటే సంతోషంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఫిన్లాండ్ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. గత ఎనిమిదేళ్లుగా ఈ దేశం నంబర్ 1 స్థానంలో ఉండటం గమనార్హం. అయితే భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ ఈ జాబితాలో 109 వ ర్యాంకులో ఉంది. గత సంవత్సరం పాకిస్తాన్ కు 108 వ ర్యాంకు లభించగా.. తాజా నివేదికలో పాకిస్తాన్ ఒక ర్యాంక్ కోల్పోయింది.

Also Read: మంత్రులే లక్ష్యంగా హనీట్రాప్ – వలపు వలతో ప్రజాప్రతినిధులకు బెదిరింపులు

ప్రపంచంలోని 147 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఆయా దేశాల్లోని పౌరుల జీవన నాణ్యత ఎలా ఉందనే అంశం ఆధారంగా రేటింగ్స్ ఇస్తారు. పౌరులు తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం, సామాజిక మద్దతు కోసం ఆధారపడటం, నివసిస్తున్న ఇంటి పరిమాణం వంటి అంశాలు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. తాజాగా ఈ సంవత్సరం ఈ అధ్యయనంలో ఇతరుల దయ, నమ్మకం పొందడం అనే అంశాన్ని కూడా ప్రతిపాదికగా చేర్చారు.

మెరుగు పడిన ఇండియా ర్యాంక్

హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఇండియా స్కోర్ 4.389కి చేరింది. దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవితం, ఆయుర్దాయం, దాతృత్వం, అవినీతిపై అవగాహన వంటి అంశాలతో కూడిన విషయాలను ర్యాంకింగ్‌లో కీలకంగా తీసుకున్నారు. అయితే దాతృత్వం, అవినీతిపై అవగాహన వంటి విషయాలు భారతీయుల విషయంలో ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

హ్యాపినెస్ రిపోర్ట్ 2024లో ఇండియా 4.054 స్కోర్ సాధించింది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్రిక్స్ వెలుపల ఉన్న ఫిన్లాండ్ 7.741 స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా 6.725 స్కోరుతో మెరుగైన స్థానంలో ఉంది. 2024 హ్యాపినిస్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం.. 30 నుంచి 44 ఏళ్ల మధ్య గల భారత పౌరులు అతి తక్కువ సంతోషంగా ఉన్నట్లు తేలింది. 2006-10 నుంచి 2021-23 వరకు ఈ హ్యాపినెస్ స్కోర్ 1.124కు తగ్గింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న భారతీయ యువత ఇతర పౌరులతో పోలిస్తే అత్యంత సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×