BigTV English

Anjali : హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న అంజలి బాయ్ ఫ్రెండ్.. అస్సలు ఊహించలేదే..!

Anjali :  హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న అంజలి బాయ్ ఫ్రెండ్.. అస్సలు ఊహించలేదే..!

Anjali : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళ సినిమాలతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది హీరోయిన్ అంజలి.. ఈమె సినిమాల సంగతి పక్కన పెడితే.. గతంలో తమిళ హీరో జై తో రిలేషన్ లో ఉందన్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఏమైందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు.. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కాగా, ఈరోజు జై మరో హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగానే పెళ్లి చేసుకున్నాడా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఓ ఇంటి వాడైన హీరో జై..

కోలీవుడ్ యంగ్ హీరో జై జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత రాజారాణి సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్య సినిమాలు పెద్దగా రాలేదు కానీ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని ఓ వార్త అయితే నెట్టింట గత కొద్ది రోజులుగా షికారు చేస్తుంది. తాజాగా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది.. హీరో జై స్వయంగా తన సోషల్ మీడియాలో న్యూ లైఫ్ స్టార్ట్ అంటూ పోస్ట్ పెట్టడంతో వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందని అందరూ భావిస్తున్నారు. జై పెళ్లి చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు ప్రగ్యా నగ్రా.. మెడలో తాళిబొట్టుతో జై, ప్రగ్యా నగ్రా ఇద్దరు చాలా సన్నిహితంగా కలిసి ఉన్న ఫోటోతో పాటు హనీమూన్ కి వెళ్తున్నట్టు పాస్పోర్ట్ లు చేతిలో పట్టుకున్నారు.దీంతో జై, ప్రగ్యా నగ్రా పెళ్లి చేసుకున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే వీరి పెళ్లి జరిగింది నిజం కాదు.. ఓ మూవీ షూటింగ్ లో ఫోటో అని తెలుస్తుంది. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియాలంటే హీరో జై క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..


Also Read : తన కూతురి విషయంలో దిద్దుకోలేని తప్పు చేసిన జగపతి బాబు..?

అంజలి కండీషన్స్ వల్లే ఆఫర్స్ రావడం లేదా..? 

హీరోయిన్ అంజలి ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. అయితే ఈమధ్య హీరోయిన్గా కన్నా గెస్ట్ రోల్ లో, లేదా ఐటెం సాంగ్స్ లలో కనిపిస్తుంది. హీరోయిన్ గా అంజలికి అవకాశాలు రాలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఆమె నిర్మాతలకు పెట్టే కండిషన్స్ వల్లే, పెద్దగా పట్టించుకోవడంలేదని పక్కన పెట్టేశారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. జై వల్లే ఆమెకు ఆఫర్స్ తగ్గాయ్యని అప్పటిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంజలి సినిమా కోసం ఎక్కడికైనా వేరే దేశానికి తీసుకువెళ్తే అంజలితో పాటు తనకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్మాతలకు కండిషన్ పెట్టేవారట. ఈ కండిషన్ల కారణంగా నిర్మాతలు హీరోయిన్ అంజలిని పక్కన పెట్టి వేరే హీరోయిన్స్ కూడా తీసుకున్నారట. అంజలి జై ని ప్రేమించి తప్పు చేశానని తెలుసుకొని చివరికి ఆయనకు బ్రేకప్ చెప్పింది. ఇక అంజలి సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ప్రస్తుతం ఓ రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×