Jailer 2 Shooting Update.. సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ (Rajinikanth ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏడుపదుల వయసులో కూడా యంగ్ ,స్టార్ హీరోలు అందరికీ గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘జైలర్’ సినిమాతో తానేంటో నిరూపించుకున్న రజినీకాంత్.. ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 ఆగస్టు 10 విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా రజనీకాంత్ వయసుకు తగ్గట్లు పాత్రను డిజైన్ చేసి, ఎక్కడ అసంతృప్తి కలగకుండా.. కథను ముందుకు చాలా చక్కగా నడిపించారు నెల్సన్. ఇందులో రజనీకాంత్ హీరోయిజం, మేనరిజం , యాక్షన్ సీక్వెన్స్ కి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మరో 20 రోజుల్లో రజినీకాంత్ పార్ట్ పూర్తీ..
ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్ లాల్ , సునీల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, తమన్నా, వినాయకన్, మీర్ణా మీనన్ తోపాటు పలువురు కీలకపాత్రలు పోషించారు. ఇలా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది కాబట్టి ఈ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 సినిమా కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులంతా కూడా ఎదురు చూస్తున్న చిత్రమిది. 2026 వేసవి విడుదల కోసం సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా.. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళ లోని అథపాడిలో రజినీకాంత్ తో పాటు ఇతరులపై ముఖ్యమైన సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. దానికోసమే భారీ సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తూ ఉండగా.. మరో 20 రోజుల్లో రజినీకాంత్ భాగాన్ని పూర్తిచేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్.
తదుపరి షూటింగ్ అక్కడే..
ఇక అంతేకాదు కేరళ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం చెన్నైకి రానుంది. ఇక్కడ నెల్సన్ క్రేజీ కామెడీ సీన్స్ ను తెరకెక్కిస్తారట. ఇక రజనీకాంత్ ఫ్యామిలీ సీన్స్ తన మనవడు, భార్య క్యారెక్టర్ రమ్యకృష్ణ (Ramya Krishna) లపై సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మొదటి సినిమాలోని వీరి కామెడీ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సీక్వెల్ లో రాబోతున్న ఈ కామెడీ తో ప్రేక్షకులను మరలా ఆకట్టుకోబోతారో చూడాలి. ఇక రజినీకాంత్ విషయానికి వస్తే.. బస్ కండక్టర్గానే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. నాటక రంగంలో తన ప్రతిభ చాటి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు పోషించి, ఆ తర్వాత హీరోగా మారారు. ఇక తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, సౌత్ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు కూడా.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి అదిరిపోయే సర్ప్రైజ్.. ఏకంగా అన్ని కోట్ల విలువైన కార్ బహుమతి..!