ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు కి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకు అంటే ఆ జట్టు కీలక ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా వైదొలగినట్టు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తిరిగి న్యూజిలాండ్ కి పయనమయ్యారని వెల్లడించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ జరిగిన సమయంలో ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ టీమ్ లక్నో తలపడుతోంది.