NTR New Movie : స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR)మునిమనవడు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ(Harikrishna ) మనవడు, జానకీరామ్ (Janaki Ram) కొడుకు అయిన ఎన్టీఆర్ (NTR ) తొలిసారి ఇండస్ట్రీకి అడుగుపెట్టబోతున్నారు. నందమూరి నాలుగవ జనరేషన్ కి చెందిన ఈ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం మొత్తం తరలివచ్చింది. ఎన్టీఆర్ తొలి మూవీ ప్రారంభోత్సవంలో నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) క్లాప్ కొట్టగా..నందమూరి మోహన్ కృష్ణ (Nandamuri Mohan krishna) మొదటి షార్ట్ కు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి కుటుంబ సభ్యులు ఇలా చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమం అనంతరం ఫోర్త్ జనరేషన్ కిడ్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు , ఆయన పక్కనే నిలబడి చూసే మా తాత హరికృష్ణ గారు, అలాగే మా నాన్న జానకిరామ్ గారు ఆశీస్సులు ఎప్పటికీ నాతోనే ఉంటాయనే నమ్మకం నాలో ఉంది. ఈరోజు మా తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు, నానమ్మ, మొత్తం కుటుంబం నన్ను ప్రోత్సహిస్తూ నాకు సపోర్ట్ ఇవ్వడం మరింత ఆనందంగా ఉంది. నేను వెయ్యబోయే ప్రతి అడుగులో కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోడై ఉంటుంది ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్” అంటూ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఈ యంగ్ హీరో కూడా కుటుంబం గొప్ప గురించి తప్ప ఇంకేం మాట్లాడకపోవడంతో ఒక వర్గం ఆడియన్స్ ఎప్పుడూ చెప్పేదే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ మూవీ విశేషాలు..
ఎన్టీఆర్ మొదటి సినిమాను ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి రూపొందిస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా స్ట్రాంగ్ టెక్నికల్ టీం ఈ సినిమాకు పనిచేస్తోంది. ప్రముఖ ఆస్కార్ గ్రహీత, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి (MM Keeravani)మ్యూజిక్ అందిస్తున్నారు. ‘న్యూ టాలెంట్ రోస్ పతాకం’ పై వైవిఎస్ చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే నాలుగవ తరానికి చెందిన ఈ ఎన్టీఆర్.. తొలి అడుగుతోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంటాడా అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకులలో మొదలయ్యింది. మరి ఇతడు భవిష్యత్తులో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు చూడాలి..ఇక నందమూరి కుటుంబం విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కుటుంబం నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇండస్ట్రీకి మూల స్తంభం లాంటివాళ్ళు. సాంఘిక, పౌరాణిక, చారిత్రక చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈయన.. అటు రాజకీయంగా కూడా చక్రం తిప్పారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి సంచలన విజయం అందుకున్నారు అంతేకాదు కాంగ్రెసేతర పార్టీని స్థాపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు ఎన్టీఆర్. అంతే కాదు ఈయన స్థాపించిన ఎన్నో పథకాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆయన మరణాంతరం ఆయన వారసులు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు పలువురు నటన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
also read:Nandamuri Family Issues : ఎన్టీఆర్ నోట బాల బాబాయ్ పేరు… హమ్మయ్యా.. వీళ్లు కలిసిపోయారు
ఎన్టీఆర్ ఫస్ట్ స్పీచ్.. సేమ్ టూ సేమ్..
NTR's First Speech.#Muhurtham #NTR #YVSChowdary #Tollywood #TeluguCinema #BIGTVCinema pic.twitter.com/YbIt6MJQQG
— BIG TV Cinema (@BigtvCinema) May 12, 2025