BigTV English

Bosco Martis : జాన్వీ అయినా చెప్పాలిగా.. డిస్పాయింట్ అయినా చుట్టమల్లే కొరియోగ్రాఫర్ బోల్డ్ కామెంట్స్

Bosco Martis : జాన్వీ అయినా చెప్పాలిగా.. డిస్పాయింట్ అయినా చుట్టమల్లే కొరియోగ్రాఫర్ బోల్డ్ కామెంట్స్

Bosco Martis: తెలుగు సినిమాల లో డాన్స్ కు ఉన్న ప్రాధాన్యత వేరు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ డాన్సుల వెనకాల ఉన్న కొరియోగ్రాఫర్ల కఠోరమైన శ్రమ, సినిమా హిట్ అయ్యేందుకు ఎంతగానో దోహదపడతాయి. అయినప్పటికీ వారికి సరైన గుర్తింపు లభించడం లేదనేది సినీ పరిశ్రమలో చర్చనీఅంశమైంది. గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ ఆల్బమ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘చుట్టమల్లే’ సాంగ్ కి ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. ఈ పాటకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ పాటతో హీరోయిన్ జాన్వి కపూర్  తెలుగులో క్రేజీ హీరోయిన్ అయింది. పాటలో స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ బాస్కోమార్టిస్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రఫీకి తగిన గుర్తింపు లభించడం లేదని సంచలమైన కామెంట్స్ చేశారు ఆ వివరాలు చూద్దాం..


జాన్వీ అయినా చెప్పాలిగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక ఈ మూవీలో ‘చుట్టమల్లె’ పాట అనిరుద్ సంగీతంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ డాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు. ఈ పాట యూట్యూబ్లో320 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించింది. ఈ పాట కొరియోగ్రాఫీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటను కొరియోగ్రాఫ్ చేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రతి సినిమా కోసం కొరియోగ్రాఫర్ ఎంతో కష్టపడతాడు. ఈ మూవీ కోసం నేను అంతే కష్టపడ్డాను, కొరియోగ్రఫీ విషయంలో నాకు సరైన గుర్తింపు లభించడం లేదు. కనీసం ప్రమోషన్స్ టైం లో అయినా జాన్వి కపూర్ ఈ పాట గురించి ప్రస్తావిస్తారని నేను అనుకున్నాను. కానీ అలా ఏం జరగలేదు. వాళ్లు గుర్తించినప్పుడు మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనకు క్రెడిట్ ఇవ్వాలని మనం ఎవరిని బలవంతం చేయలేము కదా, అందుకే ఏ పాటైనా కొరియోగ్రఫీ చేసింది ఎవరో ఆడియన్స్ కి తెలిసేలాగా ఒక ప్రోటోకాల్ ని తీసుకురావాలి’ అని బాస్కో తెలిపారు. ఇక ఇప్పటికైనా కొరియోగ్రాఫర్స్ విషయంలో సరైన గుర్తింపు తీసుకురావడానికి నిర్మాత మండలి కృషి చేయాలని నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.


ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకున్నారు ..

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కోమార్టీస్ 2000 సంవత్సరంలో వచ్చిన ‘మిషన్ కాశ్మీర్’ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టారు. ఇక ఎన్నో హిందీ, తెలుగు,తమిళ్ సినిమాలలో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈయన పాటలు ఎన్నో పాపులర్ అయ్యాయి. 75 చిత్రాలలో 200 పాటలకు పైగా కొరియోగ్రాఫీ అందించారు బాస్కో. గతంలోనూ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసారు.ఆ మూవీ లో ‘తౌబా తౌబా’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మూవీ  ప్రమోషన్స్ టైం లో విక్కీ, బాస్కో గురించి ప్రస్తావించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక ‘దేవర’ సినిమా 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపు 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

 

Ajith Kumar: అజిత్ 64 మూవీ అప్డేట్స్.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×