Vishwak Sen on Allu Arjun: విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో విశ్వక్ ఇచ్చే స్పీచెస్ చాలా కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి. రీసెంట్ సినిమా ఈవెంట్ లో కూడా విశ్వక్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సోషల్ మీడియా జనరేషన్ లో ఏ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అని వెంటనే పట్టేయడం అనేది పెద్ద విషయం కాదు. కొన్ని ఉద్దేశించిన మాట్లాడిన మాటలైతే ఇంకొన్ని ఉద్దేశపూర్వకం కాకపోయినా కూడా కొన్ని మాటలకు కౌంటర్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భమే ఇప్పుడు ఒకటి జరిగిందని చెప్పాలి. లేదంటే నిజంగానే అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ విశ్వక్సేన్ అలా మాట్లాడాడని క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Vishwambhara: ‘విశ్వంభర’ అప్డేట్.. చిరు, త్రిష మధ్య రొమాంటిక్ డ్యూయెట్ సిద్ధం
విశ్వక్సేన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా మెకానిక్ రాకి. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు ట్రైలర్లు రిలీజ్ చేశాడు విశ్వక్. ఈ రెండు ట్రైలర్లు కూడా సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెట్టాయి. అయితే కొంతమంది మాత్రం ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు అని విశ్వక్సేన్ కు చెప్పినప్పుడు.. మహారాజా (Maha raja) సినిమా ట్రైలర్ చూసినప్పుడు కూడా పెద్దగా ఎవరికి ఏమీ అనిపించలేదు. విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా కొత్తగా అనిపించింది. ఇప్పుడు మెకానిక్ రాకి కూడా అలాంటి సినిమానే అంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లో విశ్వక్సేన్ మాట్లాడాడు. ఈ విషయాన్ని కొంతమంది ట్రోల్ చేసినా కూడా మళ్లీ మళ్లీ అదే విషయాన్ని చెబుతూ వస్తున్నాడు విశ్వక్.
Also Read : Allu Arha: బాలయ్యకే ముచ్చెమటలు పట్టించిన అల్లరిపిల్ల అర్హ.. ఏం చేసిందో చూడండి
ఇక ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ విశ్వక్ ఈ సినిమా పోతే నేను జూబ్లీహిల్స్ లో షర్టు విప్పి తిరుగుతాను అంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే స్పీచ్ చివర్లో నేను ఇలా చెప్పను ఈ సినిమా పోతే ఇంకొక సినిమా చేస్తాను అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే గతంలో ఒకసారి అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ, ఈ సినిమాను చూసిన తర్వాత ఎలా తీశారు అని సుకుమార్ (Sukumar) గారి దగ్గరికి వచ్చి మాస్టర్ క్లాస్ నేర్చుకొని వెళ్తారు. ఒకవేళ అలా వెళ్లక పోతే నేను మైత్రి ఆఫీసులో షర్టు విప్పి తిరుగుతూ అంటూ అల్లు అర్జున్ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియోకి విశ్వక్సేన్ మాట్లాడిన వీడియోను అటాచ్ చేస్తూ చాలామంది పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి విశ్వక్ అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ అలా మాట్లాడాడని చాలామంది ఇప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నారు.