BigTV English

Janhvi kapoor: పెళ్లి ప్రణాళికలు వేసుకుంటున్న జాన్వీ.. అలాంటి వాడే కావాలంటూ మాస్టర్ ప్లాన్..!

Janhvi kapoor: పెళ్లి ప్రణాళికలు వేసుకుంటున్న జాన్వీ.. అలాంటి వాడే కావాలంటూ మాస్టర్ ప్లాన్..!

Janhvi kapoor: అతిలోక సుందరి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి (Sridevi) నేడు మన మధ్య లేకపోయినా.. ఆమె వారసురాలు జాన్వీ కపూర్ (Janhvi kapoor) మాత్రం తన తల్లిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి రేంజ్ లో పాపులారిటీ అందుకోకపోయినా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె, గత ఏడాది కొరటాల శివ (Koratala shiva), ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఇదే తొలి తెలుగు చిత్రం కూడా. ఈ సినిమా విజయం సాధించడంతో ఈమెకు అవకాశాలు భారీగా తలుపు తడుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకి సైన్ చేసిన వెంటనే తెలుగులో అవకాశాలు వేగంగా వచ్చి పడ్డాయి. అలా బుచ్చిబాబు సనా (Bucchibabu sana ) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ramcharan ) నటిస్తున్న RC 16 సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎన్నికయింది.


పెళ్లి గురించి అలాంటి కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్..

ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో జాన్వీ కపూర్ ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇటీవల కూడా స్వామి వారిని దర్శించుకున్న ఈమె, అక్కడ పద్ధతిగా లెహంగా ధరించి తెలుగింటి అమ్మాయిలా రెడీ అయ్యి, అందరినీ ఆకట్టుకుంది. ఇక తనకు తిరుమల అంటే చాలా ఇష్టం అని కూడా తెలిపింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఒక షోలో మాట్లాడుతూ.. తన పెళ్లి డ్రీమ్ గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ.. ” నేను పెళ్లి చేసుకొని తిరుమల తిరుపతి లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. నాకు ముగ్గురు పిల్లలు కావాలి. రోజు అరటి ఆకుల్లోనే భోజనం చేయాలి. “గోవిందా గోవిందా” అనే నామస్మరణం వినాలి. మణిరత్నం సాంగ్స్ వింటూ గడిపేయాలి. మా ఆయన లుంగీలో కనిపించాలి” అది చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. మొత్తానికైతే జాన్వీ కామెంట్స్ కి ఆ షో లో ఉన్న హోస్ట్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan johar ) కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. జాన్వీ కపూర్ కి ఇంతటి ఆలోచన ఉందా? పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఆలోచిస్తోంది.. నిజంగా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం.


జాన్వీ కపూర్ కెరియర్..

హిందీలో 2018లో ‘ధడక్’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె పలు అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా లోక్ మత్ స్టైలిష్ అవార్డులలో భాగంగా స్టైలిష్ డిప్యూటెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. అంతేకాదు ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో జీ సినీ అవార్డులు కూడా అందుకుంది. ఇక సూపర్ స్టైలిష్ యూత్ ఐడల్ అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులను సొంతం చేసుకుంది జాన్వి కపూర్. ఇలా ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×